సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది దర్శకులు అత్యంత వేగంగా సినిమాలను రూపొందిస్తూ సంవత్సరానికి ఒకటి , మరి కొంత మంది కనీసం రెండు సంవత్సరాలకు ఒక సినిమాలనైనా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఉంటారు. కానీ కొంత మంది దర్శకులు మాత్రం అత్యంత స్లోగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఉంటారు. అలా అత్యంత స్లోగా సినిమాలను రూపొందిస్తున్న దర్శకులలో వేణు శ్రీరామ్ ఒకరు. ఈయన 2011 వ సంవత్సరం విడుదల అయిన ఓ మై ఫ్రెండ్ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు.

ఈ మూవీలో సిద్ధార్థ్  హీరోగా నటించగా హన్సిక హీరోయిన్గా నటించింది. శృతి హాసన్ ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత వేణు శ్రీరామ్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు నాని హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ) అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ 2017 వ సంవత్సరం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ మంచి విజయం సాధించిన కూడా వేణు శ్రీరామ్ తన తదుపరి మూవీ కి చాలా ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఈయన వకీల్ సాబ్ అనే మూవీ ని రూపొందించాడు. పవన్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ 2021 సంవత్సరం విడుదల అయ్యింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ మంచి విజయం అందుకున్నాక కూడా ఈయన చాలా ఎక్కువ గ్యాప్ తన తదుపరి మూవీ కి తీసుకున్నాడు. తాజాగా వేణు శ్రీరామ్ "తమ్ముడు" అనే సినిమాను రూపొందించాడు.

మూవీ ఈ రోజు అనగా 2025 జూలై 4 వ తేదీన విడుదల కానుంది. ఇలా ఈయన ప్రతి సినిమాకు చాలా ఎక్కువ గ్యాప్ తీసుకుంటూ వస్తున్నాడు. ఈయన ఇప్పటివరకు దర్శకత్వం వహించిన ప్రతి సినిమాకు దిల్ రాజు నిర్మాత. దిల్ రాజు నిర్మాణంలో వరుసగా సినిమాలు చేస్తున్న చాలా మంది దర్శకులు కూడా స్లో గా మూవీలను రూపొందిస్తున్న వారు ఉన్నారు. ఆ కోవలోకే వేణు శ్రీరామ్ కూడా చేరిపోయాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sv