- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ కుర్ర క్రేజీ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ సినిమా తమ్ముడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. అయితే సినిమాకు తొలి రోజుకే తీవ్రమైన నెగెటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. నితిన్ కెరీర్ లో తమ్ముడు కూడా ఓ బిగ్గెస్ట్ ప్లాప్‌ సినిమాగా నిలవబోతుందని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి. అయితే తమ్ముడు సినిమా రిజ‌ల్ట్ .. నితిన్ చేసే తర్వాత సినిమాపై కూడా ప్రభావం చూపుతోందా అనే సందేహం నెలకొంది. డైరెక్టర్ వేణు ఎలదండి డైరెక్షన్లో నితిన్ త్వరలో ఎల్లమ్మ అనే సినిమాలో నటించిన ఉన్నాడు.


బ‌ల‌గం సినిమా సూప‌ర్ హిట్ అయ్యాక వేణు ఎల‌దండి ఈ సినిమా క‌థ‌ను రెడీ చేసుకున్నాడు. ఈ సినిమాను కూడా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమ్ముడు సినిమాతో ప్లాప్ అందుకున్న నితిన్ తో దిల్ రాజు మరోసారి రిస్క్ తీసుకుంటారా ?ఎల్లమ్మకు నితిన్ స్థానంలో మరో హీరోను తీసుకుంటారా అనే సందేహాలు ఇప్పుడు టాలీవుడ్ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఓ క్లారిటీ వరకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంది. ఏదేమైనా త‌మ్ముడు రిజ‌ల్ట్ దిల్ రాజును బాగా డిజ‌ప్పాయింట్ చేసింద‌నే చెప్పాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: