`బింబిసార` ఫేమ్ వశిష్ట మల్లిడి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రూపొందుతున్న సోసియో ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ `విశ్వంభర`. త్రిష హీరోయిన్ కాగా.. ఆషికా రంగనాథ్, కొనాల్ కపూర్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల‌ను పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది.


ఇక‌పోతే విశ్వంభర విడుదల తేదీపై సస్పెన్షన్ నెల‌కొన్న‌ సంగతి తెలిసిందే. నిజానికి 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. కానీ అదే టైంలో రామ్ చరణ్ `గేమ్ ఛేంజ‌ర్‌` బరిలోకి దిగడంతో త‌న‌యుడి కోసం తండ్రి వెనక్కి తగ్గారు. అయితే తాజా సమాచారం ప్రకారం విశ్వంభర విడుదల విషయంలో మేకర్స్ ఒక నిర్ణయానికి వచ్చారట. ఈ సినిమాను సెప్టెంబర్ 18 దసరా కానుకగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యార‌ట‌. కానీ, ఈ నిర్ణయం నిజంగా రిస్క్ అని చెప్పుకోవచ్చు.


ఎందుకంటే, సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `ఓజీ`,  నట‌సింహ నందమూరి బాలకృష్ణ `ఆఖండ 2` విడుదల అయ్యేందుకు ముస్తాబ‌వుతున్నాయి. ఒకవేళ అఖండ 2 విడుద‌ల‌ పోస్ట్ పోన్ అయినప్పటికీ.. తమ్ముడితో చిరంజీవి పోటీ పడతారా? అన్నదే ఇక్కడ ప్రశ్నగా మారింది అయితే ఓజీ రిలీజ్ కు వారం రోజులు గ్యాప్ ఉండడంతో విశ్వంభ‌ర మేకర్స్ సెప్టెంబర్ 18న సినిమాను రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నారట. మ‌రి అదే జ‌రిగితే అన్న‌ద‌మ్ముల మ‌ధ్య బ్యాక్సాఫీస్ ఫైట్ త‌ప్ప‌దు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: