కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కాంతార. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి ఫ్రీక్వెన్ ని కూడా ప్రకటించడం జరిగింది. కాంతార చాప్టర్1 అనే టైటిల్ ని పెట్టి మరి శరవేగంగా సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే ప్రశ్నపై గత కొద్దిరోజులుగా అభిమానులకు సందేహం ఉండేది. తాజాగా గడిచిన కొన్ని గంటల క్రితం కాంతార చాప్టర్1 చిత్రానికి సంబంధించి రిలీజ్ డేట్ ని అనౌన్స్మెంట్ చేశారు.

ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదీన 2025న చాలా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నట్లు హోంభలే ఫిలిమ్స్ బ్యానర్ వారు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నట్లు సమాచారం. హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తన డైరెక్షన్ లోనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా గత  కొన్ని రోజులుగా షూటింగ్ అయితే జరుపుకుంటోంది. అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా చేసుకోవడానికి కొంతమెరకు సమయం పడుతుందని అందుకే సినిమా విడుదలకు మరి కొన్ని నెలలు  పట్టిందని అలాగే కాంతార సినిమా షూటింగ్లో కూడా వరుస ప్రమాదాలు జరగడంతో షూటింగ్ ఆలస్యం అవుతోందట.


అయితే ఏడాది అక్టోబర్ రెండవ తేదీన కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాకి సంబంధించి కొంతవరకు కర్ణాటక ప్రాంతంలో  సినిమా షూటింగ్ జరిపిన.. మరికొంత భాగాన్ని ఇతర రాష్ట్రాల నుంచి కూడా షూటింగ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ చిత్రాన్ని మరికొన్ని భాషలలో కూడా ఈసారి డబ్బింగ్ చేసి విడుదల చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ విషయానికి వస్తే.. హీరో రిషబ్ శెట్టి చేతిలో గొడ్డలి పట్టుకొని చాలా బీకర యుద్ధానికి సిద్ధమన్నట్లుగా కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలెవెల్లోని రిలీజ్ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: