
ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తొలి సినిమాతోనే మెప్పించిన తెలుగు అమ్మాయి ఇప్పుడు కోలీవుడ్లో ఏకంగా బడా నిర్మాత సరసన నటించబోతుంది అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా పాపులారిటీ సంపాదించుకున్న కేజీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఒక సినిమాలో ఆయన హీరోగా నటిస్తున్నాడు. ఇప్పుడు రెండో సినిమాను కూడా ప్రకటించేసాడు.
ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమాలో ఆయనకు జోడిగా "కోర్టు" మూవీ హీరోయిన్ శ్రీదేవి నటిస్తుంది. సోషల్ మీడుయాలో పలు వీడియో ద్వార పాపులారిటీ సంపాదించుకున్న శ్రీదేవి ..ఈ కోర్టు మూవీ ద్వారనే హీరోయిన్ గా తన లక్ ని పరీక్షించుకుంది. అయితే ఇప్పుడు ఆ లకి ని కోలీవుడ్ లో పరీక్షించుకోబోతుంది శ్రీదేవి. గతంలో శివ కార్తీకేయన్ తో హీరో ,డాక్టర్ ,ఆయాలన్ సినిమాలు చేశారు. విజయ్ సేతుపతి కాపే రణ సింగంతో పాటు ప్రభుదేవా తో "గులేబకావళి" వంటి సినిమాలను కూడా ఆయన నిర్మించడం విశేషం . పలు తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ చిత్రాలకి కూడా ఆయన డిస్ట్రిబ్యూటర్ గా వర్క్ చేశారు. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేసాడు రెండవ సినిమాలో హీరోయిన్ గా కోర్టు మూవీ హీరోయిన్ శ్రీదేవిని చూస్ చేసుకోవడం హైలెట్ గా మారింది. దీనికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్..!