
సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ ఆర్. బి. చౌదరి, పరాస్ జైన్ కలిసి నిర్మించిన గోరింటాకు మూవీ 2008 జూలై 4న రిలీజ్ అయింది. అంతకన్నా ముందు `ఎవడైతే నాకేంటి` వంటి మాస్ అండ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాతో రాజశేఖర్ బిగ్ హిట్ అందుకుని ఉన్నారు. ఆ వెంటనే గోరింటాకు వంటి పక్కా ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ట్రాజడీ ఎండింగ్ కారణంగా మొదట ఈ మూవీ ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు. ఫస్ట్ వీక్ యావరేజ్ కలెక్షన్స్ రావడంతో సినిమా డిజాస్టర్ అని అంతా అనుకున్నారు.
కానీ అటువంటి సమయంలో ఓ కాంట్రవర్సీ సినిమాను కాపాడింది. గోరింటాకు మూవీలోని ఒక సీన్ లో నటుడు ఆకాష్ `మీ అన్న చెబితే కుంటోడు, గుడ్డోడుని కూడా పెళ్లి చేసేసుకుంటావా?` అంటూ మీరా జాస్మిన్ తో ఓ డైలాగ్ చెబుతాడు. ఈ డైలాగ్ రచ్చకు తెర లేపింది. హ్యూమన్ రైట్స్ అధికారులు వెంటనే ఈ డైలాగ్ ను సినిమా నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్స్ చేశారు. ఈ కాంట్రవర్సీతో గోరింటాకు మూవీకి భారీ పబ్లిసిటీ ఏర్పడింది. ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూ కట్టారు. అలా సినిమా రెండో వారం నుంచి పుంజుకుని మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఆ ఏడాది హైయెస్ట్ గ్రాసర్స్ లో టాప్ 6 ప్లేస్ లో నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది.