
టాలీవుడ్ యంగ్ టైగర్ ... మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా వార్ 2. బాలీవుడ్ క్రేజీ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ భారీ సినిమా కోసం ఇండియన్ సినీ జనాలు ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తోన్న సంగతి అందరికీ తెలిసిందే. నార్త్ లో హృతిక్ రోషన్ ఉన్నాడు. ఇక సౌత్ సహా యూఎస్ మార్కెట్ లో ఎన్టీఆర్ తన స్టామినా చూపిస్తున్నాడు. ఇక త్రిబుల్ ఆర్ , దేవర సినిమా లతో ఎన్టీఆర్ అటు నార్త్ లోనూ సక్సెస్ ఫుల్‌గా జెండా పాతేశాడు. దీంతో ఇప్పుడు వార్ 2 విషయంలో కూడా ఎన్టీఆర్ కోసం నార్త్ జనాలు ఆసక్తితో ఉన్నారు. ఇక వార్ 2 ట్రైలర్ తర్వాత ఇతర పాటలు, ట్రైలర్ లాంటివి ఇంకా రావాల్సి ఉంది.
మరి వీటిలో ట్రైలర్ పై ఇంట్రెస్టింగ్ రూమర్ అయితే ఇప్పుడు ఈ సినిమా మేకర్స్ ద్వారా వినిపిస్తుంది. ఈ సినిమా విషయంలో దర్శకుడు అయాన్ ముఖర్జీ చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట. మరీ ముఖ్యంగా వీఎఫ్ ఎక్స్ వర్క్ విషయంలో ఆయాన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఈసారి ఎన్టీఆర్ పై ఎలివేషన్స్ కూడా గట్టిగా ఉండేలా సీన్లు డిజైన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక టీజర్ కు విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో వచ్చిన కామెంట్లు ఇప్పుడు రాకుండా చాలా నేచురల్ గా విజువల్స్ ఉండేలా డిజైన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు