
అయితే అప్పుడే ఈ పాత్ర చేయాలి అంటే ఆ ఒక్కడే కరెక్ట్.. ఈ పాత్రను బాగా చేయగలడు అంటూ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పగా ఎవరు అని కూడా రామకృష్ణ అడగ్గా "కోటా" పేరు వినిపించింది . ఎస్ అవును .. అతనే ఈ పాత్రకి ప్రాణం పోయగలడు అంటూ ముచ్చటపడి ఆయన రాసుకున్న పాత్ర కోసం కోటా నే కరెక్ట్ అంటూ పిలిపించారట. కోటా కూడా ఆ సీన్ ని చేయాలి అంటూ ఆవేశంతో ఊగిపోతూ డైలాగ్ చెప్పాడు . కానీ కోట చేసిన పర్ఫామెన్స్ కోడి రామకృష్ణకి నచ్చలేదు .
వన్స్ మోర్ అనే సౌండ్ వినిపించింది. దీంతో అంతా షాక్ అయ్యారు . ఎందుకంటే కోట శ్రీనివాసరావు సినీ హిస్టరీ లోనే సెకండ్ టెక్ తీసుకోవడం ఇదే మొదటిసారి. అలా ఒకటి కాదు రెండు కాదు దాదాపు 17 సార్లు టేక్ తీసుకున్నారట కోట శ్రీనివాసరావు . దీంతో కెమెరామెన్ ఎస్ గోపాల్ రెడ్డి గమనించి పక్కకు పిలిచి.. కోట ఇది నువ్వు చేయగలవు ..నువ్వే చేయాలి అంటూ ఎంతో ధైర్యంగా మాటలు చెప్పారట. కోడి రామకృష్ణ గారు బ్రేక్ చెప్పడంతో కోటా పక్కకు వెళ్లి కాస్త తీర్థం పుచ్చుకొని వచ్చి సెట్లో నిలబడ్డారట . వెంటనే మందు వాసన రావడంతో "ఏంటి వాసన..??" అంటూ అందరూ ఆశ్చర్యకరంగా చూశారట . ఇంతలోనే కోడి రామకృష్ణ గారు యాక్షన్ అని చెప్పడం కోట డైలాగును అదరగొట్టడంతో చప్పట్ల వర్షం కురిసింది . కోటా నటించిన సీన్స్ అందరికీ ఫుల్ కిక్ ఎక్కించేసింది. షాట్ విజయవంతంగా ముగిసింది. ఆ సినిమాలోని ఆ సీన్ ఎన్నిసార్లు చూసిన తనవి తేరదు . ఇది నిజంగా కోటా శ్రీనివాసరావువేనా..? అని అనిపించేలా ఉంటుంది అని కోడి రామకృష్ణ ఈ సీన్ గురించి ఎన్నో సందర్భాలలో వివరించారు..!!