
అంతలా ఆమె పెట్టిన పోస్ట్ ఎమోషనల్ గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. కోటా శ్రీనివాసరావు మరణించిన విషయం అందరికీ తెలిసిందే . ఆయన మరణ వార్త తెలిసి ప్రముఖులు హుటాహుటిన హైదరాబాద్లోని ఫిలిం నగర్ లోని ఆయన నివాసానికి తరలివస్తున్నారు . నేడు సాయంత్రం మూడు గంటల 30 నిమిషాలకు ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి . కోట శ్రీనివాసరావు మన మధ్య లేరు అన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు . పలువురు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
ఇండస్ట్రీకి ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది అంటూ పలువురు స్టార్స్ చెప్పుకొస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే హీరోయిన్ సమంత కూడా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇన్ స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు . కోటా శ్రీనివాసరావు ఫోటోని షేర్ చేస్తూ "మీ ప్లేస్ ఇండస్ట్రీలో ఎవరు భర్తీ చేయలేనిది " అంటూ క్యాప్షన్ రాస్తూ దండం పెడుతున్న ఎమోజిని జోడించారు . సమంతకి కోటా శ్రీనివాసరావు తో ఉన్న స్పెషల్ బాండింగ్ అందరూ గుర్తు చేసుకుంటున్నారు . బృందావనం సినిమాలో అదే విధంగా మరికొన్ని సినిమాలలో కోట శ్రీనివాసరావు తో స్క్రీన్ షాట్ చేసుకునింది సమంత . హీరోయిన్ సమంత పెట్టిన పోస్ట్ ఇప్పూదు వైరల్ గా మారింది..!!