తన ఫేస్ వ్యాల్యూతోనే భయపెట్టేటువంటి నటన కలిగి ఉన్న నటుడు కోటా శ్రీనివాసరావు.. ఈరోజు ఉదయం తీవ్ర అస్వస్థకు గురై తెల్లవారుజామున కన్నుమూశారు. అయితే సినీ ఇండస్ట్రీలో ఎంత పేరు సంపాదించరో ఈయన జీవితంలో కూడా అన్నే కష్టాలు కన్నీళ్లు మిగిలాయి. సుమారుగా రోజుకి 20 గంటల పాటు పనిచేసేవారట. ఒక్క మాటలో చెప్పాలి అంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావును మించిన నటుడే లేరని ఎన్నోసార్లు తనని తాను నిరూపించుకున్నారు. ఊహించిన దానికంటే అంతకుమించి నటనతో ఎన్నో వందలాది చిత్రాలలో నటించారు.


కోట్లాది రూపాయల ఆస్తిని కూడా సంపాదించారు. 2010 జూన్ 21న కోట శ్రీనివాసరావు కుమారుడు ఆంజనేయ ప్రసాద్ మరణించారు. తన కొడుక్కి తలకొరివి పెట్టాల్సి వచ్చింది. కోట శ్రీనివాసరావు మరణించే వరకు తను ఈ బాధని పడుతూనే ఉన్నారట.

ఆయన జీవితంలో కష్టాలకు కొదవలేదన విషయాన్ని గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు 1968 లో రుక్మిణి తో వివాహమయిందని 1973లో తన భార్య డెలివరీ అయినప్పుడు ఒక విషాద సంఘటన మిగిలింది.. ఆ సమయంలో ఆమె తల్లి మరణించారు. అప్పుడు తన భార్యకు ఒక చిన్నపాటి సడన్ షాక్ తగిలిందని. ఆ విషయాన్ని తాను గమనించలేకపోయాను సైకియాక్ట్రిక్ పేషెంట్గా మారిపోయిందని 30 ఏళ్ల పాటు తాను ఎవరు గుర్తుపట్టలేదని.. తాను కొట్టిన తిట్టినా సహించాను.. ఈ విషయం తనకు క్లోజ్ గా ఉన్న వారికి మాత్రమే తెలుసని ఇంకెవరికీ తెలియదని వెల్లడించారు.


అలాగే తన రెండవ కూతురు ఎంకామ్ చదివింది. విజయవాడలో బంధువులతో కలిసి రిక్షాలో వెళుతున్న సమయంలో ఎదురుగా బ్రేకులు ఫెయిల్ అయిన లారీ రిక్షాను గుద్దింది.ఈ ప్రమాదంలో కొంతమంది చనిపోగా తన కూతురు కాళ్లు కోల్పోయి ప్రాణాలతో బయటపడిందని తెలిపారు.


బ్యాంకులో ఎవరి దగ్గర గుమస్తాగా పనిచేసే వాడిన ఆయన దగ్గర తన వియ్యంకుడుగా మారానని.. తన కూతురి జీవితం బాగుంటుందని ఆనందపడేలోపు తన కుమారుడు మరణించారని.. ఆ భగవంతుడు తనకు ఎంత పేర్చిన అన్నే కష్టాలు కన్నీళ్లను మిగిల్చాడని ఎన్నోసార్లు ఇంట్లో కూర్చొని నేర్చుకున్న సందర్భాలు ఉన్నాయంటూ తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: