సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలపై కోటా శ్రీనివాసరావు అప్పట్లో వేసిన కౌంటర్లు చాలామంది హీరోలకు షాక్ ఇచ్చింది. అయితే ఒకప్పుడు హీరోలు ఎలా ఉండేవారు ఇప్పటి హీరోలు ఎలా ఉంటున్నారు..ఈ కుప్పిగంతులు ఏంటి..కోతి చేష్టలు ఏంటి.. అంటూ ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాస రావు మాట్లాడిన మాటలు సినీ ఇండస్ట్రీలో పెద్ద దుమారం సృష్టించాయి. దాంతో కోట శ్రీనివాసరావు మాట్లాడిన మాటలకు పోలిక ఉన్న చాలామంది హీరోలు కోటా శ్రీనివాస్ పై మౌనయుద్ధం ప్రకటించారు. వాళ్ళ సినిమాల్లో కోట శ్రీనివాస రావు కి అవకాశాలు ఇవ్వకపోవడం వంటి పనులు చేశారు.అయితే కోట శ్రీనివాసరావు హీరోలను ఉద్దేశించి ఏం మాట్లాడారు అనేది చూస్తే.. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో ఉండే పరిస్థితులు ఇప్పుడు లేవు..

గతంలో హీరోలు జైలుకు వెళ్ళిన సమయంలో మాసిపోయిన గడ్డంతో చింపిరి జుట్టుతో దర్శకులు వాళ్ళని చూపించేవారు. కానీ ఇప్పటి జనరేషన్ హీరోలు మాత్రం జుట్టు ఇంతలా పెంచుకొని..మొహం నిండా గడ్డంతో కనిపిస్తున్నారు.అసలు మొహం నిండా గడ్డం పెట్టుకొని కనిపించే వాళ్ళు హీరోలా. ఇక హీరోయిన్ ని పడగొట్టడం కోసం హీరోయిన్ల ముందు కుప్పిగంతులు వేస్తూ గిలగిలా పడి  కింద మీద పడి డాన్సులు వేస్తూ ఉంటారు. బయట సమాజంలో ఉండే అమ్మాయిల ముందు అబ్బాయిలు అలా కింద పడి పడి డ్యాన్సులు వేస్తారా..అదేంటి అని అడిగితే ఫ్లోర్ డ్యాన్సులు అంటున్నారు ఇవేంటో అర్థం అవ్వడం లేదు.

 ఇక సినిమాలో ఎన్ని పాటలు ఉంటే ఆ పాటలు అన్నింటి వెనక బ్యాగ్రౌండ్ డాన్సర్లుగా దాదాపు 50, 100 మందిని తీసుకుంటున్నారు.ఇక బ్యాగ్రౌండ్ లో ఎంతమంది డాన్సర్లు ఉంటే పాటకి అంత పేరు వస్తుంది కావచ్చు అనుకుంటారు.. అలాగే హీరోలు గిలగిలా పడి కొట్టుకునే డ్యాన్స్ మూమెంట్లు ఏంటో అర్థం అవ్వడం లేదు అంటూ హీరోలకి డైరెక్ట్ గానే చురకలు అంటించారు.అయితే ముక్కుసూటి తనంతో మాట్లాడే కోట శ్రీనివాసరావు మాటల కారణంగా చాలాసార్లు వివాదాల్లో ఇరుక్కున్నారు. కానీ ఆయన ఎక్కడా కూడా తలవంచేవారు కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: