
ఒకవేళ అదే నిజమైతే మాత్రం విలన్ క్యారెక్టర్ లో నటించి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ గా చరిత్రలో నిలిచిపోతాడు జూనియర్ ఎన్టీఆర్ . అంతే కాదు ప్రశాంత్ నీల్ తో ఆయన ఓ సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమాకి డ్రాగన్ అనే పేరు కూడా కన్ఫామ్ చేసినట్లు తెలుస్తుంది . "డ్రాగన్" అనే వర్కింగ్ టైటిల్ తో ప్రెసెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమాకి సంబంధించి ఏ న్యూస్ లీకైన రిలీజ్ అయిన ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. అయితే ఈ సినిమా కోసం తారక్ చాలా చాలా కష్టపడుతున్నాడు. ఈ సినిమా కోసం బరువు చాలా తగ్గిపోయాడు . ఆయన లుక్స్ చూస్తే అది ఈజీగా అర్థమయిపోతుంది .
గతంలో కళ్యాణ్రామ్ నటించిన "అర్జున్ సన్నాఫ్ వైజయంతి" ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించిన తారక్ కి ఇప్పుడు మనం చూస్తున్న తారక్ కి చాలా తేడా ఉంది . రీసెంట్గా ఎయిర్ పోర్ట్ లో బాగా సన్నబడిన ఎన్టీఆర్ ని మనం చూసాం. సన్నగా మారడంతో అందరూ స్టన్ అయిపోయారు . ఇంతలా మారడానికి కారణం డ్రాగన్ సినిమాలోని తన పాత్ర అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . ప్రశాంత్ నీల్ సూచనలు మేరకే తారక్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు అంటూ ఫిలిం సర్కిల్స్లో ఓ న్యూస్ వైరల్ అవుతుంది . డ్రాగన్ సినిమా 1960-70 లలో బెంగాల్ నేపథ్యంలో సాగునున్నట్లు తెలుస్తుంది.
ఇందులో పాన్ ఇండియా ఎన్టీఆర్ మాఫియా కనిపించబోతున్నారట . ఆ కారణంగానే పూర్తిగా బరువు తగ్గిపోయారట . అయితే ఎన్టీఆర్ లుక్స్ పట్ల విపరీతంగా ట్రోలింగ్ కూడా జరుగుతుంది . ఎన్టీఆర్ చూడడానికి బొద్దుగా ఉన్నప్పుడే బాగున్నాడు అని ఇప్పుడు అసలు బాగోలేడు అని కామెంట్స్ చేస్తున్నారు జనాలు. అంతేకాదు ఎన్టీఆర్ దేవర 2 కోసం మళ్లీ బరువు పెరగాలట . ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోగానే దాదాపు ఆరు - ఏడు కేజీలు బరువు పెరిగి దేవర 2 సెట్స్ లో పాల్గొనాలట . ఇది నిజంగా చాలా టఫ్ జాబ్ . ఒక సినిమా కోసం లావు తగ్గడం ఒక సినిమా కోసం లావు పెరగడం అంటే ఆరోగ్యం పాడు చేసుకున్నట్లే. చాలామంది ఈ న్యూస్ తెలుసుకొని ఎన్టీఆర్ ను అలా చేయొద్దు అంటూ సజెస్ట్ చేస్తున్నారు . బరువు తగ్గిపోయి ఇలా అయినా ఉండు బరువు పెరిగితే అలాగే బరువు కంటిన్యూ చెయి.. ఇలా సినిమా కోసం తగ్గుతూ పెరుగుతూ పోతే హెల్త్ బాగోదు అంటూ సజెస్ట్ చేస్తున్నారు..!!