టాప్ హీరోల సినిమాలు ఒకరి పై ఒకరు పోటీగా విడుదల అయిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. దీనితో ఆ హీరోల అభిమానుల మధ్య వార్ కొనసాగడం అనేకసార్లు జరిగింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల రిలీజ్ విషయంలో అయోమయం కొనసాగుతోంది. దీనికి అనేక కారణాలు ప్రభావితం చేస్తున్నాయి.


గ్రాఫిక్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో పాటు సినిమా బిజినెస్ ఓటీటీ డీల్స్ పూర్తికాకపోవడం ఇలా రకరకాల కారణాలతో సినిమాల రిలీజ్ వాయిదా పడుతోంది. అనుష్క నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ‘ఘాటీ’ సమ్మర్ లో రిలీజ్ అవుతుందని భావించారు. అయితే రకరకాల కారణాలతోపాటు విఎఫ్ఎక్స్ పనుల్లో ఆలస్యం కారణంగా ఈ మూవీ ఇప్పటివరకు విడుదల కాలేదు.


దర్శకుడు క్రిష్ రూపొందించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ మూవీలో అనుష్క మునుపెన్నడూ చేయని వైలెంట్ అవతారంలో కనిపిస్తుంది అన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఈ మూవీ బిజినెస్ బాగా జరిగింది అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాను సెప్టెంబర్ 5న విడుదల చేయబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.


అయితే అదేరోజు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ కూడా విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వరస హిట్స్ తో దూసుకుపోతున్న రష్మిక నటించిన మొట్టమొదటి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కావడంతో ఈ మూవీ పై కూడ భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. రష్మిక టైటిల్ రోల్ లో నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఇది. తనకున్న ఆమెకు ప్రస్తుతం ఉన్న ఇమేజ్ రీత్యా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారు. అయితే ఇదే సెప్టెంబర్ 5న తేజ సజ్జ నటించిన ‘మిరాయ్’ కూడ విడుదల అవుతుంది అంటున్నారు. దీనితో ఏ సినిమాసినిమా కోసం త్యాగం చేసుకుంటుంది అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది..  

మరింత సమాచారం తెలుసుకోండి: