టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ల లో ఒకరు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లే దు . ఈయన దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు రాజమౌళి చాలా సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. దానితో ఈయనకు దర్శకుడిగా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. రాజమౌళి ఆఖరుగా రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాని రూపొందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖుల నుండి అద్భుతమైన ప్రశంశాలు దక్కాయి. అలాగే ఈ సినిమాకు ఎన్నో గొప్ప గొప్ప పురస్కారాలు కూడా దక్కాయి. ప్రస్తుతం రాజమౌళి , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా ప్రియాంక చోప్రా హీరోయిన్గా ఓ మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా రాజమౌళి ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు వ్యాపార వేత్త అయినటువంటి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు అయినటువంటి కిరీటి నటించిన జూనియర్ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నాడు.

అందులో భాగంగా ఈయన తనకు నచ్చిన సినిమా ఏది అనేది చెప్పుకొచ్చాడు. తాజాగా రాజమౌళి మాట్లాడుతూ ... తన బెస్ట్ ఫిలిం ఈగ అని చెప్పుకొచ్చాడు. ఈగ సినిమా 2012 వ సంవత్సరం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ లో నాని హీరోగా నటించిన సమంత హీరోయిన్గా నటించింది. సుదీప్ కిచ్చా ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: