ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఎంటైర్ టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే అక్కినేని అఖిల్ తాజాగా నటిస్తున్న సినిమా "లెనిన్" . ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . ఈ సినిమాతో ఓ బిగ్ హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు అఖిల్ అంటూ అక్కినేని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  మురళీ కిషోర్ అపూర్వ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండడం గమనార్హం.  కాగా చాలా డిఫరెంట్ కాన్ సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుందట.


కెరియర్ లోనే  ఫస్ట్ టైం యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మూవీ తో అఖిల్ జనాలని పలకరించబోతున్నారు . ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీలను అనుకున్నారు మూవీ మేకర్స్. ఆమె పై కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారు . అయితే కొన్ని కారణాల చేత ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది . ఆమె ప్లేస్ లోకి యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ని చూస్ చేసుకున్నారు మ్నూవీ మేకర్స్ అంటూ ఓ న్యూస్ బాగా గట్టిగా వినిపించింది. ఆల్ మోస్ట్ ఆల్ ఆమె సెలెక్ట్ అయినట్లు టాక్ వినిపించింది .



మరి కొద్ది రోజుల్లో ఆమె  సినిమా సెట్స్ లో జాయిన్ అవ్వబోతుంది అనగా ఆమె కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ఓ న్యూస్ తెలుగు ఫిలిం సర్కిల్స్ ట్రెండ్ అవుతుంది. రీజన్ ఏంటో తెలియదు కానీ భాగ్యశ్రీ బోర్సే కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఆమె ప్లేస్ లోకి వేరే హీరోయిన్ ని తీసుకొచ్చే  ప్రయత్నాలు చేస్తున్నారట మూవీ మేకర్స్.  అయితే ఒకరి తర్వాత ఒకరు ఎందుకు ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నారు అనే విషయంపై క్లారిటీ రాలేదు . దీనిపై చిత్ర బృందం ఇంకా ఏ విధంగా స్పందించలేదు . ఇది  నిజంగానే నిజమా..? హీరోయిన్సినిమా నుంచి తప్పుకుంటున్నారా..? లేదా ఫేక్ వార్తనా..?  తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సిందే . లేకపోతే సినిమాకి భారీ నష్టం తప్పదు . కానీ అఖిల్ అక్కినేని ఈ సినిమాతో ఇరగదీస్తాడు అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . రిలీజ్ అయిన పోస్టర్స్ అలా ఉన్నాయి .  మొత్తానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత అక్కినేని అఖిల్ ఈ సినిమాతో హిట్ కొట్టబోతున్నాడు . అది మాత్రం ఖాయం అంటూ ఫ్యాన్స్ 100 కి 100% నమ్మేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: