సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఒక్కే  పాత్రకి కనెక్ట్ అయిపోతారు . అలాంటి జోనర్ లోనే  సినిమాలను తెరకెక్కించుకుంటూ ఉంటారు.  వాళ్ళ దగ్గరికి వేరే డైరెక్టర్లు కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన పెద్దగా లైక్ చేయరు . ఎవరో 100లో 30% మంది మాత్రమే అలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ ఉంటారు . ఖచ్చితంగా ఆ 30% లో నాగార్జున ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు . నాగార్జున  గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మల్టి టాలెంటెడ్ హీరో. "మన్మధుడు" సినిమాలో నాటిగా చూసాం . అన్నమయ్య సినిమాలో ట్రెడిషనల్ గా చూసాం.


ఇలా రెండు వేరియేషన్స్ నాగార్జునలో మనం చూసి ఆయనని ఎంకరేజ్ చేసి పెద్ద స్టార్ గా మార్చేసాం . నాగార్జున కూడా ఏ రోల్ కి అయినా సూట్ అయిపోతాడు. ఆ విధంగా నటిస్తూ ఉంటారు.  మొన్నటికి మొన్న "కుబేర" సినిమాలో నెగిటివ్ షేడ్స్  రోల్ లో ఎలా నటించి మెప్పించాడు అనేది అందరికి తెలుసు. నెగిటివ్ పాత్రని కూడా అవలీలగా నటించి జనాలు చేత శభాష్ అంటూ మార్కులు వేయించుకున్నాడు. అయితే అలా ఒకపక్క రొమాంటిక్ మరొక పక్క దేవుడి పాత్రలలో నటించే సాహసం ఎవరు చేయరు .



ఫర్ ద ఫస్ట్ టైం ఆ రిస్కీ పని చేయబోతున్నాడు ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో "మురుగన్" సినిమాలో ఎన్టీఆర్ ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్ అయిపోయినట్లే అంటూ లీకైన అప్డేట్స్ ఆధారంగా తెలుస్తున్నాయి.  అయితే ఈ సినిమాలో పూర్తిగా దేవుడు గెటప్ లోనే కనిపించబోతున్నాడట తారక్. ఎన్టీఆర్ ని మనం ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి ఒక గెటప్ లో చూడలేదు . ఒకవేళ ఈ సినిమాల్లో దేవుడి గెటప్ లో కనిపిస్తే మాత్రం నాగార్జున తర్వాత అలాంటి ఒక రేర్ రికార్డు అందుకున్న ఘనత ఎన్టీఆర్కి దక్కుతుంది . ఈ సినిమా తెరకెక్కాలి అన్న రిలీజ్ అవ్వాలి అన్న దాదాపు మూడేళ్లు పై మాటే.  ప్రజెంట్ ఎన్టీఆర్ పలు పాన్ ఇండియా  సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: