హన్సిక అత్తింట్లోని వారు అంత టార్చర్ చేశారా..అందుకే భర్తతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుందా.. ఇంతకీ ముంబై లో ఉన్న హన్సిక మీడియా వాళ్ళతో ఏం చెప్పింది అనేది ఇప్పుడు చూద్దాం.. హన్సిక మోత్వాని సోహైల్ కతురియాని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే సోహైల్ కి అప్పటికే హన్సిక ఫ్రెండ్ తో పెళ్లి అయింది.ఆ పెళ్ళికి హన్సిక కూడా వెళ్లి సందడి చేసింది. కానీ చివరికి స్నేహితురాలి భర్తనే బుట్టలో వేసి స్నేహితురాలు కాపురంలో చిచ్చు పెట్టింది. అలా రెండో పెళ్లి వాడైనా సోహైల్ ని చేసుకొని హన్సిక ఎన్ని రోజులో హ్యాపీగా ఉండలేదు. వీరి మూడేళ్ల వైవాహిక జీవితంలో రెండు సంవత్సరాలు కూడా కలిసి ఉండలేదట. గత కొద్ది నెల నుండి హన్సిక పుట్టింట్లోనే ఉండడంతో హన్సిక విడాకుల వార్తలు ముంబై మీడియాలో ఎక్కువగా వినిపించాయి. ఇక హన్సిక విడాకుల వార్తల గురించి అసలు నిజం ఏంటో తెలుసుకోవడానికి హన్సిక ని ముంబాయి మీడియా వాళ్ళు ప్రశ్నించగా విడాకుల గురించి అవునని కానీ కాదని గానీ సమాధానం ఇవ్వలేదట. 

దీంతో మీడియా వాళ్లకి మరిన్ని లీకులు ఇచ్చినట్టు అయింది. ఇక హన్సిక భర్త సోహైల్ విడాకులు లాంటిది ఏమీ లేదని చెప్పినప్పటికీ హన్సిక ఆన్సర్ ఇవ్వకపోవడంతో విడాకులు నిజమేనని అందరూ భావిస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే తాజాగా హన్సిక విడాకులకు కారణం ఏంటో బయటపడింది.అదేంటంటే హన్సిక అత్తింటి వారిది చాలా పెద్ద ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీలో చిన్న ఫ్యామిలీలో పుట్టి పెరిగిన హన్సిక పోసగలేకపోయిందట. చిన్న కుటుంబం నుండి ఉమ్మడి కుటుంబంలోకి కోడలుగా వెళ్లిన హన్సికకు అక్కడి పద్ధతులు కట్టుబాట్లు అస్సలు నచ్చలేదట. దాంతో అత్తింట్లో చాలా సార్లు టార్చర్ అనుభవించిందట. ఇక వేరు కాపురం పెడదామని హన్సిక భర్తకు చెప్పిన కూడా ఆయన పట్టించుకోకపోవడంతో చివరికి భర్తనే వదిలేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అందుకే చాలా రోజుల నుండి భర్తను వదిలేసి పుట్టింట్లోనే హన్సిక ఉంటున్నట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికి హన్సిక అత్తింట్లో వేధింపులు అనుభవించింది అనే వార్త బయటకు రాగానే చాలామంది నెటిజన్లు హన్సిక చేసిన పాపం పండింది.ఎందుకంటే హన్సిక ఇంట్లో ఆమె వదిన అంటే సోదరుడి భార్య ఎంతలా అయితే టార్చర్ అనుభవించిందో ఇప్పుడు హన్సిక కూడా అత్తింట్లో అంతే టార్చర్ అనుభవించింది. హన్సిక వదిన హన్సికపై హన్సిక తల్లిదండ్రులపై, సోదరుడిపై గృహహింస కేసు పెట్టింది.వాళ్లు ఆమెని ఎంత టార్చర్ చేస్తే ఆమె కోర్టు దాకా వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు.ఇప్పుడు హన్సిక ఎలా అయితే తన ఇంటికి వచ్చిన కోడల్ని టార్చర్ చేసిందో హన్సిక కూడా అలాంటి టార్చర్ తన అత్తింట్లో ఎదురైంది. ఇప్పుడు అర్థమైంది కావచ్చు తన వదిన ఎంత ఇబ్బందులు పడిందో అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: