
'ఆర్ఆర్ఆర్' vs 'వీరమల్లు' – బ్రిడ్జ్ క్లైమాక్స్ పోలికలు .. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్ – ఎన్టీఆర్ ఇద్దరూ స్నేహితులుగా చిన్న పాపను కాపాడేందుకు బ్రిడ్జ్ మీద నుంచి తాళ్ల సాయంతో దిగే సీన్ ఎంతమంది హృదయాల్లో నిలిచిపోయిందో తెలిసిందే. ఇదే తరహాలో ‘హరి హర వీరమల్లు’ క్లైమాక్స్‌లో పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ కలిసి ఒక మిషన్‌లో భాగంగా చేతులు కలిపి ఆత్మీయంగా కనిపించే సీన్ ఉంది. కానీ ఇందులో మేజర్ ట్విస్ట్ ఏంటంటే – వీరిద్దరూ స్నేహితులు కాదు, శత్రువులు. ఇది రాముడు – రావణుడు కలవడంలా ఉందని కొందరు ట్వీట్స్ చేస్తున్నారు. ఈ సీన్‌ను కొందరు మోస్తరిగా ఆహ్వానించినా, బహుళం మాత్రం “ఇంత బలహీనమైన విజువల్ ఎఫెక్ట్‌తో సీన్ ఎందుకు తీశారు?” అంటూ ట్రోలింగ్ మొదలెట్టారు. ఆ క్లైమాక్స్ సీన్ కంటే ముందు సినిమాను ముగించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బాబీ డియోల్ పాత్రపై నిరాశ: ఔరంగజేబ్ పాత్రలో నటించిన బాబీ డియోల్ పర్ఫామెన్స్ అట్టహాసంగా ఉండేలా ప్రోమోస్ ద్వారా హైప్ ఇచ్చినప్పటికీ, ఆయనకు సినిమా మొత్తం ఎకౌంటబుల్ సీన్లు తక్కువగా ఉండటంతో అభిమానులు నిరాశ చెందారు.
పవన్ – బాబీ మధ్య మాస్ ఫేస్ ఆఫ్ సీన్లు ఉండొచ్చని ఆశించినవారు అసంతృప్తిగా ఉన్నారు. అయితే దీనిపై దర్శకుడు నిదర్శనంగా క్లైమాక్స్‌లో ట్విస్ట్ చూపిస్తూ, సెకండ్ పార్ట్ కి బలమైన పునాది వేసినట్లుగా కనిపిస్తోంది. హిట్ ఖాయం? : అయితే పవన్ కళ్యాణ్ బ్రాండ్ వర్కౌట్ అయిందన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రేమియర్ షోలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక అమెరికాలో కూడా భారీ ఎత్తున పడ్డాయి. అభిమానుల సందడి, ఫ్లెక్సీలు, భారీ కటౌట్లు, థియేటర్ల వద్ద కోలాహలంతో సినిమా ఓ ఫెస్టివల్‌గా మారింది. ఈ క్రేజ్‌కు తగినట్టే బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ భారీగా వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘హరి హర వీరమల్లు’ కంటెంట్ పరంగా కొన్ని బలహీనతలున్నా, పవన్ కళ్యాణ్ స్టామినా, ఫ్యాన్ బేస్ వలన సినిమా వాణిజ్యంగా సేఫ్ జోన్‌లోకి వెళ్తుందనడంలో సందేహమే లేదు. అయితే రెండో భాగం ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో, అప్పటిదాకా ఈ "బ్రిడ్జ్ ట్విస్ట్" చర్చ మాత్రం ఆగేలా లేదు!