పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన ‘హరిహర వీరమల్లు’  థియేటర్లలో  విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలంటేనే భారీ అంచనాలు ఉండే రోజులు. కానీ ఈ సినిమా విషయంలో కథ అలా జరగలేదు. విడుదలకు ముందు వరకూ సినిమా మీద ఫ్యాన్స్‌లో కూడా ఆశలు ఎక్కువగా కనిపించలేదు. ప్రచారానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యే వరకు ‘వీరమల్లు’కు సరైన బజ్‌ కనిపించలేదు. అయినా, సినిమా విడుదలైన తర్వాత మొదటి షో నుంచే మిశ్రమ స్పందన మధ్య భారీ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.


రెండు భాగాలుగా ‘హరిహర వీరమల్లు’... ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేశామని ప్రకటించారు. కానీ ప్రేక్షకుల్లో ఆ రెండో భాగంపై ఆసక్తి ఉన్నట్టు మాత్రం కనిపించలేదు. ప్రస్తుత సినిమాను ప్రమోట్ చేసిన టైటిల్:  "హరిహర వీరమల్లు – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్". ఇది తొలి భాగానికి సంబంధించినది. అయితే సినిమా చివర్లో ‘ హరిహర వీరమల్లు – బాటిల్ ఫీల్డ్ ’ అనే క్యాప్షన్ వదిలారు. ఇది రెండో భాగం టైటిల్ అని స్పష్టమవుతోంది. పవన్ – బాబీ కాంబినేషన్పై నిరాశ ... సినిమాలో బాబీ డియోల్‌ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రలో నటించగా, ఆయనతో పవన్ కళ్యాణ్ మధ్య ఎక్కువ సన్నివేశాలు ఉంటాయని ప్రేక్షకులు ఆశించారు. కానీ సినిమాను చూస్తే, క్లైమాక్స్‌లోని ఒక్క సంభాషణలైన సీన్ మినహా, ఇద్దరి మధ్య ఎలాంటి ఫేస్ టు ఫేస్ మాజిక్ కనిపించలేదు. ఈ విషయంలో అభిమానులే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా కొంత నిరాశ చెందారు. అయితే దర్శకుడు  ఇదంతా రెండో పార్ట్‌కు బేస్ వేయడం కోసమే చేశారన్న అర్థం స్పష్టంగా కనిపిస్తోంది.



మిశ్రమ స్పందన – భారీ ఓపెనింగ్స్ .. సినిమా చూసినవారిలో కొందరికి సినిమా బాగుందన్న అభిప్రాయం ఉన్నా, చాలామందికి ఫస్ట్ హాఫ్ బాగుండి, సెకండ్ హాఫ్ తగ్గిందన్న భావన ఉంది. క్రిటిక్స్ కూడా ఇదే రకమైన టోన్‌లో రివ్యూలు ఇస్తున్నారు. ఇక, సోషల్ మీడియాలో  వైసీపీ అనుకూల శ్రేణుల ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినప్పటికీ, ఈ ట్రోల్స్ సినిమాకు నష్టంగా కాకుండా, ఓ రకంగా పబ్లిసిటీగా మారాయి. ప్రీమియర్ షోల నుంచే సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టినట్టు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. తొలిరోజే పవన్ మ్యానియా ఎలా ఉంటుందో మరోసారి నిరూపితమైంది. కానీ మౌత్ టాక్ బలహీనంగా ఉండటంతో, వీకెండ్ కలెక్షన్స్‌పై కోంత‌ ప్రభావం ఉండే అవకాశం ఉంది.



రెండో పార్ట్‌కు దారితీసే క్లైమాక్స్ ..  సినిమా క్లైమాక్స్‌లోనే రెండో పార్ట్‌కు బలమైన సూచనలు కనిపించాయి. పవన్ – బాబీ మధ్య యుద్ధభూమిలో జరుగనున్న ఘర్షణకు బాటలు వేసేలా దర్శకుడు కథను ముగించాడు. అందుకే ఈ పార్ట్‌ను "స్వార్డ్ వర్సెస్ స్పిరిట్"గా ముగించి, తదుపరి భాగాన్ని "బాటిల్ ఫీల్డ్ష‌  గా అనౌన్స్ చేయడం గమనార్హం. హరిహర వీరమల్లు తొలి భాగం ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయినా, వాణిజ్యంగా బలంగా నిలిచేలా కనిపిస్తోంది. ముఖ్యంగా రెండో భాగంలో పవన్ – బాబీ డియోల్ మధ్య ఘర్షణ, యుద్ధ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉండే అవకాశం ఉంది. ఈ పంథాలో, రెండో పార్ట్ మీద హైప్ దిశగా దర్శక నిర్మాతలు ఇప్పటినుంచే వ్యూహాలు ప్రారంభిస్తే తప్ప, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచ‌టం కష్టమే!

మరింత సమాచారం తెలుసుకోండి: