సడన్గా ఇక్కడున్న ఫోటో చూసి ఎవరు ఇతను అని అనుకుంటున్నారా..? అరెరె ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడో చూసినట్లుంది అని మాట్లాడుకుంటున్నారా ..? మీరు ఈ వ్యక్తిని చాలాసార్లు  చూసుంటారు. చాలా ఈవెంట్లో కూడా చూసుంటారు.  కానీ ఈ విధంగా కాదు కొంచెం బొద్దుగా లడ్డులా మన కంటికి కనపడి ఉంటారు . కానీ ఇప్పుడు మాత్రం చాలా సన్నగా ఒక హ్యాండ్ సమ్ అంకుల్ లా తయారయిపోయాడు . ఇక్కడ చూస్తున్నది ఎవరా..?? అని అనుకుంటున్నారా . మరి ఎవరో కాదు శ్రీదేవి భర్త జాన్వి కపూర్ తండ్రి "బోని కపూర్".


బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ . సడన్గా ఈ ఫోటో చూసి మీ కళ్ళని మీరే నమ్మలేక పోయి ఉండొచ్చు . అంతలా ఆయన బరువు తగ్గారు . ఇది ఏదో గ్రాఫిక్స్ లేకపోతే ఏఐ ఎఫెక్ట్ అంతకన్నా కాదు . బోనీకపూర్ చాలా చాలా ఈజీగా 26 కేజీల బరువు తగ్గిపోయారు. సన్నగా నాజుకుగా.. స్టైలిష్ గా తయారయ్యారు. దానికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  అయితే అంత బొద్దుగా ఉన్న బోనీ కపూర్ ఇంత సన్నగా మారడానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉంటాడో..? ఎన్ని గంటలు శ్రమించి ఉంటారో ..? అని అందరూ అనుకుంటూ ఉండొచ్చు .



కాకపోతే బోనీ కపూర్ ఒంటికి చమట పట్టకుండానే 26 కేజీల బరువు తగ్గిపోయాడు . ఒక్కరోజు కూడా జిమ్ చేయకుండా బోనీకపూర్ సరికొత్త లుక్ లోకి మారిపోయాడు . ఇప్పుడు సినీ ఫ్యాషన్ వర్గాలలో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది.  బోనీ కపూర్ మొదటి నుంచి చాలా బొద్దుగా ఉండేవాడు . అయితే ఇప్పుడు ఆయన బరువుగా ఉండడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అంటూ గ్రహించి బరువు తగ్గడానికి ప్రయత్నించారు . అందరిలా గంటలు  గంటలు జిమ్ లో సమయం కేటాయించలేదు .



కేవలం ఒకే ఒక పద్ధతిని పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యాడు.  అవసరమైనంత ఫుడ్ తినడం .. రాత్రిపూట లైట్ డిన్నర్ చేయడం.. అంతే . ఈ విధంగా ఆయన జీవనశైలిలో మార్పులు చేసుకొని ఒకటి కాదు రెండు కాదు దాదాపు 26 కేజీల బరువు తగ్గిపోయాడు. అసలు ఈ ఫొటోస్ చూస్తుంటే మన కలను మనమే నమ్మలేము. నిజంగా ఇది బోనీ కపూర్ నేనా అని ఆశ్చర్యపోవాలి .  ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ గా జూసెస్ మధ్యాహ్నం జొన్న రొట్టె రాత్రికి సూప్స్ ఇలాంటివే తీసుకున్నారట. ఆ కారణంగానే ఆయన ఇంత బరువు తగ్గాను అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు తన పని తానే చేసుకోవడం వల్ల శారీరక శ్రమ కూడా ఆయనకు బరువు తగ్గడానికి కలిసి వచ్చింది అంటూ చెబుతున్నారు. నిజానికి శ్రీదేవి బ్రతికున్నప్పుడు చా చాలా సార్లు ఆయనకి బరువు తగ్గమని సజెస్ట్ చేసిందట. కానీ ఆయన కేర్ చేయలెదౌ. ఇన్నాళ్లకి ఆమె ఆఖరి కోరికను తీర్చాడు. శ్రీదేవి ఆత్మ ఎక్కడున్న శాంతిస్తుంది అంటున్నారు ఫ్యాన్స్.   ప్రస్తుతం బోనీకపూర్ వెయిట్ రెడ్యూస్ అయిన ఫోటోలు  సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: