మలయాళ సినీ పరిశ్రమలో హీరోగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న ఫహద్ ఫాజిల్ ఎన్నో చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించి మంచి విజయాలను అందుకున్నారు. గత ఏడాది పుష్ప 2 ది రూల్ చిత్రంలో కూడా బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో అద్భుతంగా నటించారు. అల్లు అర్జున్ పాత్ర డామినేట్ చేయడం వల్ల ఫహద్ ఫాజిల్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా పైన నిరాశను తెలియజేసినట్లుగా తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.



ఫహద్ ఫాజిల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పుష్ప 2 సినిమా గురించి డైరెక్ట్ గా ప్రస్తావించకుండా గత ఏడాది ఒక పెద్ద సినిమాలో తాను నటించి ఫెయిల్ అయ్యానని.. దాని గురించి మాట్లాడాలని అనుకోవడం లేదని వెల్లడించారు. కొన్ని విషయాలను మన నియంత్రణలోనే ఉండవని అలాంటప్పుడు మనం వాటి గురించి వదిలేయాలి అంటూ తెలిపారు. అంతేకాకుండా అలాంటి వాటిని ఒక పాఠంగా మనం నేర్చుకోవాలి అంటూ ఫహద్ ఫాజిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ లో కూడా ఎక్కడా కనిపించలేదు.


అందుకే పుష్ప2  చిత్ర విషయంలో చాలా నిరాశ పడ్డాడనే విధంగా పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలోనే తనకంటూ ఒక గుర్తింపు సంపాదించిన ఈ నటుడు మలయాలంతో పాటు తెలుగు, తమిళ్ వంటి చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. పుష్ప 2 చిత్రంతో పాన్ ఇండియా లేవల్లో ఆశించిన స్థాయిలో తనకు పేరు రాకపోయినప్పటికీ కూడా తనకు పుష్ప, పుష్ప 2 సినిమాలంటే ఇష్టమే నని తెలియజేశారు. చివరిగా మారేసన్ అనే తమిళ చిత్రంలో నటించారు. ప్రస్తుతం తన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి తెలుగు సినిమా కూడా అన్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: