అక్కినేని నాగార్జున ఫర్ ద ఫస్ట్ టైం సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీలో విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్గా ధనుష్ హీరోగా చేసిన కుబేర మూవీలో ఓ కీ రోల్ పోషించినప్పటికీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అయితే నటించలేదు. కానీ రజినీకాంత్ కూలీ మూవీలో నాగార్జున పూర్తిస్థాయి నెగిటివ్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోగా దాదాపు 100 సినిమాల్లో నటించిన నాగార్జునని విలన్ పాత్రలో నటించడానికి డైరెక్టర్ ఎలా ఒప్పించారు అనే డౌట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ఇదే ప్రశ్న గురించి తాజా ఇంటర్వ్యూ లోకేష్ కనగరాజ్ ని అడగగా ఆయన చెప్పిన ఆన్సర్ అందర్నీ షాక్ కి గురి చేసింది. మరి హీరోగా ఇండస్ట్రీని ఏలిన అక్కినేని నాగార్జున ని విలన్ పాత్రలో నటించడం కోసం లోకేష్ కనగరాజ్ ఎలాంటి తిప్పలు పడ్డారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

లోకేష్ కనగరాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో నాగార్జునని విలన్ గా ఎలా ఒప్పించారో మాట్లాడుతూ.. నాగార్జున సార్ కి నేను బిగ్ ఫ్యాన్ ని.. ఆయన నటించిన గీతాంజలి,శివ,రాక్షసుడు,అన్నమయ్య వంటి సినిమాలు ఎన్నోసార్లు చూశాను.. ఇక ఆయన నటించిన రాక్షసుడు మూవీలోని హెయిర్ కటింగ్ కి నేను ఫిదా అయిపోయి ఆయనలాంటి హెయిర్ స్టైల్ నే చేయించుకున్నాను.. అలా నాగార్జున సార్ సినిమాలు చూస్తూ వీరాభిమానిగా మారిపోయిన నేను ఒక్కసారైనా సరే ఆయనతో సినిమా చేయాలని ముందు నుండే ఫిక్స్ అయ్యాను. అందుకే ఆయనతో కూలి సినిమాలో విలన్ పాత్ర వేయించాను. అయితే ఈ విలన్ పాత్ర కోసం నాగార్జున అంత తొందరగా ఒప్పుకోలేదు.

చాలాసార్లు వెంటపడి నాగార్జున సార్ ని బతిమిలాడి మరీ ఈ సినిమాలో విలన్ పాత్ర చేయమని అడిగాను.అలా దాదాపు ఏడుసార్లు నాగార్జున సార్ వెంటపడ్డాక చివరికి ఆయన ఒప్పుకున్నారు.అయితే ఎప్పుడు హీరో గానే చేస్తున్నారు కదా ఒకసారి డిఫరెంట్ క్యారెక్టర్ లో ట్రై చేయండి ప్రేక్షకులు ఆకట్టుకుంటారు అని ఆయనకు చెప్పాను. ఇక నేను అన్ని సార్లు వెంట పడడంతో నాగార్జున సార్ కూడా ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకున్నారు అంటూ లోకేష్ కనగరాజ్  చెప్పుకొచ్చారు.. ఇక రజినీకాంత్ హీరోగా నాగార్జున విలన్ గా శృతిహాసన్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర,సౌబిన్ షాహిర్, సత్యరాజ్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఐటెం సాంగ్ లో పూజ హెగ్డే,గెస్ట్ రోల్ లో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: