సినిమాని తెరకెక్కించడం పెద్ద సమస్య కాదు అభిమానులకు నచ్చిన రేంజ్ లో తెరకెక్కించడం బిగ్ పాయింట్ . అయితే సినిమాని ఎంత భారీ బడ్జెట్లో తెరకెక్కించిన జనాల్లోకి తీసుకెళ్లాలి . అప్పుడే ఆ సినిమా మంచి రిజల్ట్ అంటుకుంటుంది . ఎంత పెద్ద స్టార్ హీరో హీరోయిన్ కి అయినా సినిమా ప్రమోషన్స్ కంపల్సరీ . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సినిమాలు రకరకాలుగా ప్రమోట్ చేసుకుంటున్నారు కొంతమంది సెలబ్రిటీస్.  రీసెంట్గా అనుపమ పరమేశ్వరన్ మూవీ టీం చేసిన పని అభిమానులకి ఫుజులు ఎగిరిపోయేలా చేసింది . అందులోనూ పవన్ కళ్యాణ్ సినిమాని బాగా వాడేసుకోవడంతో పవన్ ఫాన్స్ కూడా షాక్ అయిపోతున్నారు.


అనుపమ పరమేశ్వరన్ మలయాళీ బ్యూటీనేనైనా తెలుగులో బాగా క్రేజ్ సంపాదించుకుంది . త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన "అ ఆ" అనే చిత్రంలో రావు రమేష్ కూతురిగా వల్లి క్యారెక్టర్ లో నటించి మెప్పించింది . అదే సంవత్సరం నాగచైతన్యతో  నటించిన ప్రేమమ్ సినిమాలోని కనిపించి మరోసారి ఫ్యాన్స్ ని మెప్పించింది . ఇక ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు చేసింది.. ఎలాంటి క్రేజ్ అందుకుంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తన సినిమాలు అటు ఇటుగా ఉన్న తన క్రేజ్ ని మాత్రం అసలు తగ్గించుకోలేదు అనుపమ పరమేశ్వరన్ .



రీసెంట్గా అనుపమ పరమేశ్వరణ్  నటించిన సినిమా "పరదా" ఆగస్టు 22వ తేదీ ఈ సినిమా థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు మేకర్స్ . అయితే "పరదా" అనే ఒక సినిమా ఉంది అని .. ఆ సినిమాలో అనుపమ పరమేశ్వరన్  హీరోయిన్ గా నటిస్తుంది అని .. ఆ సినిమా ఆగస్టు 22వ తేదీ రిలీజ్ కాబోతుంది అన్న విషయం అస్సలు జనాలకు తెలియనే తెలియదు . ఎవరికో కొంతమందికి మాత్రమే తెలుసు . రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటం పైగా జనాలలో పరదా అనే సినిమా ఆసక్తి పెంచకపోవడంతో మేకర్స్ సినిమా ప్రమోషన్స్ కోసం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను అడ్డు పెట్టుకున్నారు .



హైదరాబాదులోని ఐమాక్స్ థియేటర్లో కొందరు మహిళలు పరదా కప్పుకొని హరిహర వీరమల్లు చూసేందుకు వచ్చారు. తమ చీరలను తలకి పరదా మాదిరిగా కప్పుకొని సందడి చేశారు . సినిమా స్టార్ట్ అయ్యాక కూడా పరదా తీయలేదు . ఇదే హైలైట్ . ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.  అయితే చాలామంది ఇది అనుపమ పరమేశ్వరణ్ నటించిన "పరదా" సినిమా ప్రమోషన్స్ కోసం మేకర్స్ ఇలా చేశారు అంటూ మాట్లాడుకుంటున్నారు . దానికి తగ్గట్టే అనుపమ కూడా "వచ్చే నెలలో నన్ను మా ఫ్రెండ్స్ ని కూడా అక్కడ మీరు ఇలా చూడొచ్చు" అంటూ ఆగస్టు 22న పెద్ద స్క్రీన్ లో చూస్తారు అంటూ పోస్ట్ పెట్టింది . పరదా సినిమా ప్రమోషన్స్ కోసం పవన్ కళ్యాణ్ ని వాడుకున్నారు అన్న విషయం క్లియర్ గా అర్థమైపోయింది . కొంతమంది ఈ ప్రమోషన్స్ ని చాలా సిల్లీగా తీసుకుంటే .. మరి కొంత మంది ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని వాడుకుంటే గాని మీ సినిమా హిట్ అవ్వదు అనుకున్నారా ..??అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు..!


మరింత సమాచారం తెలుసుకోండి: