
"సూసైకి అగ్రి రవ్వ మాదిరి" సాంగ్ ఎంత హైలెట్ అయ్యింది అనేది అందరికీ తెలుసు . ఇక పీలింగ్స్ సాంగ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అందరికీ పీలింగ్స్ పుట్టించేసింది . అంత హాట్ గా ఉంది పీలింగ్స్ పాట . కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ విషయాని ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు. దేవిశ్రీప్రసాద్ కి "మోనాలిసా" అనే పేరు చాలా చాలా ఇష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దానికి కారణం పవన్ కళ్యాణ్ తో వర్క్ చేసిన "అత్తారింటికి దారేది సినిమాలో "నిన్ను చూడగానే చిట్టి గుండె" అనే సాంగ్లో మోనాలిసా పదాన్ని వాడాడు .
అంతేకాదు అంతకుముందు జల్సా సినిమాలో కూడా జెనిఫర్ లోఫేజ్ సాంగ్లో "మోనాలిసా" అనే పదాన్ని వాడాడు . అంతేనా రామ్ చరణ్ తో ఆయన వర్క్ చేసిన "వినయ విధేయ రామ" సినిమాలో కూడా మోనాలిసా అనే పేరును ఎక్కువగా వాడారు . దీంతో మోనాలిసా అనే పేరు ఆయనకి లక్ కలిసి వచ్చేలా చేసింది అని జనాలు మాట్లాడుకుంటున్నారు. మోనాలిసా అనే పేరు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ నోట వినిపిస్తే చాలు ఆ పాట హైలైట్ అయిపోవడమే అంటూ ఆయన ఎనర్జీని ఆయన పర్ఫామెన్స్ ని ప్రశంసిస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ అభిమానులు..!!