
తాజాగా రకుల్ ప్రీతిసింగ్ సెలబ్రెటీల పైన నెగటివ్ కామెంట్స్ చేసే వారందరికీ గట్టి కౌంటర్ ఇస్తూ ఫైర్ అయ్యింది. సోషల్ మీడియా ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేసిందని.. దురదృష్టవశాత్తు మనదేశంలో చాలామందికీ ఎక్కువగా ఎలాంటి పనులు లేవు..వారందరికీ కూడా ఉచిత డేటా ప్లాన్లు అందుబాటులో ఉండడం వల్లే ఇతర జీవితాల గురించి చాలామంది కామెంట్స్ చేసుకుంటూ ఆనందపడుతున్నారు అంటూ ఫైర్ అయ్యింది. ఇతరులను అనే మాటలతో బాధ పెట్టడం తప్ప వారికి ఇంకేం పని లేకుండా పోయిందంటూ రకుల్ ఫైర్ అయ్యింది.
మన దేశంలో పనికిమాలిన వాళ్ళు కూడా ఎక్కువయ్యారంటూ తెలియజేసింది. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ చేసిన ఈ కామెంట్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి. అయితే కొంతమంది నెటిజెన్స్ రకుల్ చేసిన ఈ వ్యాఖ్యలకు సపోర్టుగా చేస్తూ ఉండగా మరి కొంతమంది మాత్రం సెటైరికల్ గా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. 2009లో మొదటిసారి గిల్లి అనే ఒక కన్నడ చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కెరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకొని ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఇండియన్ త్రీ, దేదే ప్యార్ దియా 2 చిత్రాలలో నటిస్తోంది.