పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. దానితో ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ మూవీ విడుదలకు దాదాపు వారం రోజుల ముందే పెద్ద ఎత్తున సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. అలాగే ఆయన అభిమానులు ఆయన సినిమా విడుదల అయిన ధియేటర్ల దగ్గర పండగ వాతావరణం సృష్టిస్తూ ఉంటారు. పవన్ నటించిన సినిమాలకు హిట్టు , ఫ్లాప్ టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా మొదటి రోజు భారీ కలెక్షన్లు వస్తూ ఉంటాయి.

అదే ఆయన నటించిన సినిమాకు మంచి టాక్ గనక వస్తే ఆ సినిమాకి చాలా రోజుల పాటు అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ "హరిహర వీరమల్లు" అనే సినిమాలో హీరో గా నటించాడు. నిధి అగర్వాల్మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా జూలై 24 వ తేదీన పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు , మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర కాస్త నెగటివ్ టాక్ వచ్చింది. అయినా ఈ సినిమాకు భారీ ఓపెనిక్స్ లభించాయి.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు భారీ ఓపెనింగ్లు లభించిన ఆ తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ కాస్త డ్రాప్ అయ్యాయి. మళ్లీ హాలిడే అయినటువంటి సండే రోజు ఈ మూవీ కలెక్షన్స్ కాస్త పుంజుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా బుక్ మై షో ఫ్లాట్ ఫామ్ లో అదిరిపోయే రేంజ్ రికార్డును సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు బుక్ మై షో లో ఈ సినిమాకు సంబంధించిన 1 మిలియన్ టికెట్లు సేల్ అయినట్లు తెలుస్తోంది. ఇలా బుక్ మై షో ప్లాట్ ఫామ్ లో హరిహర వీరమల్లు సినిమా అదిరిపోయే రేంజ్ ఇంపాక్ట్ ను చూపించినట్లు దీనితో స్పష్టంగా అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: