ఏంటి ఆ హీరో నిజంగానే నిత్యమీనన్ ని పెళ్లి చేసుకోవడానికి ట్రై చేశారా? పెళ్లయి పిల్లలు ఉన్న ఆ హీరోకి నిత్య మీనన్ ని మళ్లీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది..? నిత్యమీనన్ తో సినిమా చేసేటప్పుడు ఆమె ప్రేమలో పడిపోయాడా.?ఎందుకు హీరోయిన్ అలాంటి మాటలు మాట్లాడింది.? అనేది ఇప్పుడు చూద్దాం. నిత్యమీనన్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి నటించిన సార్ మేడమ్ అనే మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో నిత్యమీనన్ చాలా చురుగ్గా పాల్గొంటుంది. ఇప్పటికే ఈ సినిమా బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నట్టు చాలా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాకి హైప్ ఇస్తుంది.అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి కూడా మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటుంది. 

ఈ నేపథ్యంలోనే తాజాగా సార్ మేడమ్ చిత్ర యూనిట్ అయినటువంటి నిత్యమీనన్, విజయ్ సేతుపతిమూవీ డైరెక్టర్ పాండిరాజ్ లు,తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో కొంతమంది రిపోర్టర్లు లేచి నిత్యమీనన్ ని తన పెళ్లికి సంబంధించి అప్డేట్ ఇవ్వండి అంటూ పెళ్లి వార్తలు అడిగారు.ఇక ఈ పెళ్లి గురించి ప్రశ్న రాగానే నిత్యమీనన్ మైక్ అందుకొని మాట్లాడుతూ..పెళ్లి కోసం సినిమా డైరెక్టర్ పాండిరాజ్, హీరో విజయ్ సేతుపతి ఇద్దరు నన్ను చాలా ట్రై చేశారు అంటూ నోరు జారింది. అయితే నిత్యామీనన్ మాట్లాడిన మాటలు విన్న విజయ్ సేతుపతి పక్కనే ఉండి ఏం మాట్లాడుతున్నావ్ కాస్త సరిచూసుకొని మాట్లాడు అంటూ కల్పించుకోవడంతో నో నో నా ఉద్దేశం అది కాదు.

 నేను చెప్పాలనుకుంది వేరే అంటూ టంగ స్లిప్ అయినా నిత్య మీనన్ తన తప్పును తెలుసుకుంది.అయితే ఆలోపే నిత్యమీనన్ మాటలు విన్న అక్కడున్న వాళ్ళందరూ ఫక్కున నవ్వే సారు. అయితే నిత్యామీనన్ చెప్పిన మాటల అర్థం ఎలా ఉంది అంటే నిత్యమీనన్ ని పెళ్లి చేసుకోవడానికి డైరెక్టర్,విజయ్ ఇద్దరు ప్రయత్నించినట్టు ఉంది.కానీ నిత్య మీనన్ అసలు చెప్పాలనుకుంది ఏంటంటే.. సినిమా షూటింగ్ సెట్లో నిత్య మీనన్ ని పెళ్లి చేసుకోమని, పెళ్లి చేసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని విజయ్ సేతుపతి అలాగే డైరెక్టర్ ఇద్దరు కన్విన్స్ చేశారట. అలా తనని పెళ్లి చేసుకోమని కన్విన్స్ చేశారు అని చెప్పబోయి తనని ట్రై చేశారు అని చెప్పడంతో నిత్యమీనన్ టంగ్ స్లిప్ అయిపోయి ఈ వార్త కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: