
ఈ కాన్సెప్ట్ అంత బాగా నచ్చేసింది బన్నీకి అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకున్నారు . అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొనే సెలెక్ట్ అయింది . దానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఇప్పటికే 30% షూటింగ్ ఆమెపై కంప్లీట్ చేసేసారు చిత్ర బృందం . ఈ సినిమాలో మరొక హీరోయిన్ క్యారెక్టర్ లో మృణాల్ ఠాకూర్ సెలెక్ట్ అయింది అంటూ టాక్ వినిపించింది . పరోక్షంగా అట్లీ కూడా దాన్ని పలు ఇంటర్వ్యూలలో కన్ఫామ్ చేసేసాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ఈమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .
మృణాల్ - అల్లు అర్జున్ సినిమా నుంచి బయటికి వచ్చేసింది అన్న వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. దీపిక పదుకొనే క్యారెక్టర్ హైలైట్ గా ఉండడం..మృణాల్ ఠాకూర్ సెకండ్ హీరోయిన్ కాదు కదా సైడ్ క్యారెక్టర్ కన్నా దారుణంగా ఈ సినిమాలో సీన్స్ ఉండటమే అందుకు ప్రధాన కారణం అంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ అట్లీ సినిమాకి ఇలాంటి ఒక బ్యాడ్ రిమార్క్ రావడం ఫ్యూచర్లో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు కలెక్షన్స్ పరంగా దెబ్బ పడుతుందేమో అనే సందేహాలు కూడా ఉన్నాయి . చూడాలి మరి దీనిపై అల్లు అర్జున్ కానీ మూవీ టీం కానీ ఎలా స్పందిస్తారో..??