
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఇపుడు చేస్తున్న భారీ క్రేజీ సీక్వెల్ అఖండ 2 - తాండవం. ఈ సినిమా కోసం అందరూ కళ్లు కాయలు కాచేలా ఎంతలా వెయిట్ చేస్తున్నారో తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలయ్య సాలిడ్ లైనప్ తో రెడీ అవుతున్నాడు. అఖండ తర్వాత తనకు వీరసింహా రెడ్డి లాంటి సూపర్ మాసీవ్ హిట్ ఇచ్చిన మలినేని గోపీచంద్ దర్శకత్వం లో బాలయ్య సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఈ లైనప్ లోనే క్రిష్ తో కూడా ఓ సినిమా ఉన్న సంగతి తెలిసిందే. బాలయ్య - విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కలయికలో మూడోసారి వర్క్ చేయనున్నారు అనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్ లో బాగా వైరల్ అవుతోంది.
క్రిష్ తో గౌతమి పుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత హ్యాట్రిక్ సినిమా కోసం రెడి అవుతున్నారట. మరి ఈ సినిమా కోసం బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్ చేసేందుకు క్రిష్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నటసింహం బాలయ్య ఇపుడు వరకు ఎన్నో సినిమాలలో డ్యూయల్ రోల్స్ చేసి మెప్పించారు. ఇప్పుడు మళ్లీ క్రిష్ డైరెక్షన్ లో రెండు పాత్రల్లో అలరించనున్నారట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక అఖండ 2 షూటింగ్ శరవేగం గా జరుగుతోంది. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు