"బాలయ్య".. ఈ పేరు వినగానే అందరికీ ముఖ్యంగా గుర్తొచ్చేది డైలాగ్ డెలివరీ . అంతకంటే ముందు గుర్తొచ్చేది తొడ కొడితే ట్రైన్ లు ఆగిపోతాయ్. చాలా సినిమాలలో ఇదే సీన్స్ మనం చూస్తుంటాం. మరీ ముఖ్యంగా ఫ్యాక్షన్ సినిమాలకు మాస్ సినిమాలకు పెట్టింది పేరుగా బాలయ్య బాగా ప్రసిద్ధి చెందాడు . ప్రజెంట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2  సినిమాను చేస్తున్నాడు . ఈ సినిమాలో సంయుక్త మీనన్ కూడా నటిస్తుంది . ఈ సినిమాతో మరొక హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాడు బాలయ్య .


సినిమా అయిపోగానే టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక మూవీకి కమిట్ అయినట్లు తెలుస్తుంది . ఈ సినిమా ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఉండబోతుంది అంటూ టాక్ వినిపించిన ..దానిపై అఫీషియల్ ప్రకటన అయితే లేదు . అయితే ఇలాంటి మూమెంట్లోనే బాలయ్య నటించిన "భగవంత్ కేసరి" సినిమా ఏకంగా నేషనల్ అవార్డు అందుకోవడం పట్ల నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఈ సినిమాకు అవార్డ్ రావడం పట్ల నెగటివ్ గా కూడా కామెంట్స్ చేస్తున్నారు.



అసలు ఈ సినిమాలో ఏముంది..? ఈ సినిమాకి అవార్డు రావడం ఏంటి ..? అంటూ షాక్ అవుతున్నారు.  ఇలాంటి మూమెంట్ లోనే బాలయ్యలో ఉన్న బ్యాడ్ క్వాలిటీ కూడా కొంతమంది వైరల్ చేస్తున్నారు . బాలయ్య ఎంత మంచి మనిషి అనేది అందరికీ తెలుసు. అయితే బాలయ్య గురించి నెగిటివ్ గా మాట్లాడుకోవాలి అంటే మాత్రం కచ్చితంగా అందరూ ముందు గుర్తు చేసుకునేది ఆయన కోపం.  కోపం వస్తే బాలయ్య ఏ మాటైనా అనేస్తాడు.  ఎంత మాటైనా తూలేస్తాడు . చాలా సందర్భాలలో మనం అది చూసాం . బాలయ్య తన కోపాన్ని తగ్గించుకుంటే ఒక్క నెగిటివ్ ర్మార్క్ కూడా ఉండదు అంటూ ఫ్యాన్స్ కూడా పలు సందర్భాలలో చెప్పుకొస్తూ ఉంటారు . అయితే బాలయ్య కి ఆ కోపమే అందం అనే డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు . కేవలం బాలయ్యకే కాదు నందమూరి హీరోలు అందరికీ కూడా కోపం ఎక్కువ . జూనియర్ ఎన్టీఆర్ ..సీనియర్ ఎన్టీఆర్ ..హరికృష్ణ ..కళ్యాణ్ రామ్ .. బాలయ్య వీళ్ళందరికీ కోపం ఎక్కువే . నందమూరి ఫ్యామిలీలోనే కోపం అనేది ఇంపార్టెంట్ గా ఉండిపోయింది అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: