సీనియర్ నటి సంగీత విడాకులు తీసుకోబోతుంది అంటూ గత రెండు రోజుల నుండి ఒక వార్త సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ వార్త తో ఇదేంటి సెలబ్రిటీలు అందరికీ ఇదేం  మాయ రోగం.. ఒక్కొక్కరిగా విడాకులు తీసుకొని విడిపోతున్నారు అంటూ చాలామంది షాక్ అయిపోయారు. అయితే సంగీత విడాకుల వార్తలు వినిపించడానికి ప్రధాన కారణం ఆమె తన సోషల్ మీడియా ఐడి ని సంగీత క్రిష్ అని ఉంటే సంగీత యాక్టర్ అని మార్చుకోవడమే అంటూ చాలా మంది ఈ విషయాన్ని వైరల్ చేస్తూ సంగీత విడాకులు అంటూ ప్రచారం చేశారు. అయితే తాజాగా విడాకుల వార్తలపై దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది సంగీత. 
\
ఒకే ఒక్క ఫోటో తో క్లారిటీ ఇచ్చింది. మరి ఇంతకీ సంగీత విడాకుల పై ఎలా స్పందించింది అనేది చూస్తే.. సీనియర్ నటి సంగీత తాజాగా తన భర్త తో విడాకులు తీసుకోవడం గురించి స్పందిస్తూ.. నా భర్త తో విడాకులు తీసుకోబోతున్నాను అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవి పూర్తిగా అవాస్తవాలే..  అలాగే నా సోషల్ మీడియా ఐడి ని సంగీత క్రిష్ అని ఉంటే సంగీత యాక్టర్ అని మార్చుకున్నాను అనే దాంట్లో కూడా వాస్తవం లేదు.

ఎందుకంటే నా సోషల్ మీడియా ఐడి మొదటి నుండి కూడా సంగీత యాక్టర్ అనే ఉంది. ఇందులో మీరు అవాస్తవాలు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. అలాగే నేను నా భర్త తో విడాకులు తీసుకోవడం లేదు అంటూ పిచ్చ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో సంగీత విడాకుల వార్తలకు చెక్ పడింది.. ఇక సంగీత సెకండ్ ఇన్నింగ్స్ లో మహేష్ బాబు రష్మిక నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీలో రష్మిక తల్లి పాత్రలో నటించింది. తెలంగాణ దేవుడు, మసూద వంటి సినిమాలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: