రజనీకాంత్, నాగార్జున ప్రధాన పాత్రల్లో వస్తున్న 'కూలీ' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. సాధారణంగా, పెద్ద హీరోల సినిమాలకు 'ఏ' సర్టిఫికెట్ వస్తే, అది కలెక్షన్స్‌పై ప్రభావం చూపుతుందని సినీ విశ్లేషకులు చెబుతుంటారు. ఇప్పుడు 'కూలీ' విషయంలోనూ అదే చర్చ జరుగుతోంది.

ఏ' సర్టిఫికెట్ రావడానికి కారణం, సినిమాలో ఉన్న హింసాత్మక సన్నివేశాలు, బూతులు అని తెలుస్తోంది. నాగార్జున పాత్ర మాట్లాడే బూతులు, అలాగే యాక్షన్ సన్నివేశాల్లో చూపించిన హింస పిల్లలకు సరికాదని సెన్సార్ బోర్డ్ భావించింది. దీనివల్ల కుటుంబ ప్రేక్షకులు సైతం కొంతమేర ఈ సినిమాకు దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంది.  ఇది సినిమా కలెక్షన్స్‌పై కొంత ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ సర్టిఫికెట్ గురించి ప్రేక్షకుల్లో ఇప్పటికే ఒక చర్చ నడుస్తోంది

కూలీ' సినిమాకు ఉన్న హైప్, రజనీకాంత్ క్రేజ్ వల్ల ఈ 'ఏ' సర్టిఫికెట్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, సినిమా విడుదలయ్యాక కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి. కూలీ సినిమా సక్సెస్ సాధించడం రజనీకాంత్ కెరీర్ కు సైతం కీలకమని చెప్పవచ్చు.

ఈ మధ్య కాలంలో రజనీకాంత్ సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోలేదు. అందువల్ల కూలీ సినిమా   సైతం భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం సులువైన విషయం అయితే కాదు. అయితే  వార్2 వర్సెస్ కూలీ పోటీలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: