
ఆ తర్వాత పలు సినిమాలలో నటించి హిట్స్ ఫ్లాప్ సమాంతరంగా తనఖాతాలో వేసుకున్న మృణాల్ ఠాకూర్ రీసెంట్ గానే ధనుష్ తో ప్రేమాయణం అని రకాల రూమర్లతో సోషల్ మీడియాలో వార్తల్లో బాగా నిలిచింది. రీసెంట్ గా మృణాల్ దీనిపై క్లారిటీ ఇచ్చింది . అది వేరే విషయం . "మేము ఏమీ అలాంటి రిలేషన్షిప్ లో లేము అని జస్ట్ ఫ్రెండ్స్ అంటూ కొట్టి పడేసింది". కానీ వీళ్ళిద్దరి మధ్య చనువు చూసిన జనాలు మాత్రం ఇది ఫ్రెండ్షిప్ కాదే అంతకు మించిన లెవెల్ లోనే ఏదో ఉందే అనే విధంగా మాట్లాడుకుంటున్నారు . అయితే మృణాల్ ధనుష్ మధ్య ఏదో ఉంది అని వార్తలు వినిపిస్తున్న మూమెంట్లో మృణాల్ ఈ వార్తలు పై స్పందించి నా తప్పు లేదు అంటూ చేతులు దులిపేసుకుంది.
ఇక ధనుష్ మాత్రం మధ్యలో బకరా అయిపోయాడు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి . ధనుష్ విడాకులు తీసుకున్న తర్వాత ఎవరో హీరోయిన్ ని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూసింది . అది మృణాల్ ఠాకూరే అంటూ ఇప్పుడు క్లారిటీకి వచ్చింది. అయితే దీనిపై మృణాల్ క్లారిటీ ఇవ్వగ ధనుష్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు . దీంతో అందరు ధనుష్ మనసులో నిజంగానే మృణాల్ ఠాకూర్ ఉందా..? అనే విధంగా మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు మృణాల్ ని రష్మిక తో ముడి పెడుతున్నారు . రష్మిక కూడా విజయ్ దేవరకొండ తో లవ్ పెళ్లి రూమర్స్ అంటూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అని ..ఇప్పుడు మృణాల్ కూడా అదే బాటలో వెళ్తుంది అంటూ మధ్యలోకి రష్మిక - విజయ్ దేవరకొండలో ప్రేమాయణాన్ని తీసుకొస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది..!
'