
శుక్రవారం నాడు ఒక్క హిందీ వెర్షన్ నుంచే రూ. 4.7 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో ఇప్పటివరకు కేవలం హిందీ మార్కెట్‌లోనే రూ. 89 కోట్ల నెట్ కలెక్షన్‌ను రాబట్టింది. ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నదాని ప్రకారం, రాబోయే శని, ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరగబోతున్నాయి. అంటే వీకెండ్‌కి సెన్సేషన్ రేంజ్ నంబర్లు రావడం ఖాయం. ఈ విజయానికి ప్రధాన కారణం అశ్విన్ కుమార్ దర్శకత్వ ప్రతిభ, సామ్ సి ఎస్ అందించిన అద్భుతమైన సంగీతం. యానిమేషన్ క్వాలిటీ, యాక్షన్ సీక్వెన్స్‌లు, దేవతల పవర్‌ఫుల్ ప్రెజెంటేషన్ ఉహించని విధంగా ఒక గోప్ప మైథాలజికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, చిన్నపిల్లలు, యువత - అందరికీ ఈ సినిమా కనెక్ట్ అవ్వడం వల్ల, పదే పదే సినిమాను చూస్తున్నారు .
మరోవైపు, దేశవ్యాప్తంగా పాజిటివ్ టాక్ కొనసాగుతుండడంతో, ఇతర భాషల వెర్షన్లకూ అడ్వాన్స్ బుకింగ్స్ బలంగా ఉన్నాయి. ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి - మూడవ వారంలో కూడా మహావతార్ నరసింహ తన వేగాన్ని తగ్గించకుండా, రూ. 100 కోట్ల నెట్ (హిందీ వర్షన్‌లో) క్లబ్‌లోకి ఎంటర్ కావడం ఖాయం. సినిమా రంగంలో ఇది ఒక కొత్త మైలురాయిగా మిగిలిపోనుంది. ఎందుకంటే, లైవ్ యాక్షన్ కాకపోయినా, పక్క యానిమేషన్ తో కూడిన మైథాలజీ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ఇంత పెద్ద విజయాన్ని సాధించడం అరుదైన విషయం. మహావతార్ నరసింహ చూపించిన దారిని మరికొన్ని ఇండియన్ యానిమేషన్ ప్రాజెక్టులు కూడా అనుసరించే అవకాశం ఉంది.