నిన్న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్ అయిన అతడు సినిమా ప్రేక్షకులను అలరించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రిష జంటగా నటించారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

సినిమా రీ-రిలీజ్ అయిన మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, సీడెడ్ ఏరియాల్లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. కేవలం ఒక్క రోజులోనే ఉత్తరాంధ్రలో 28 లక్షలు, సీడెడ్ ఏరియాలో 28 లక్షల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఒక రీ-రిలీజ్ అయిన సినిమాకి ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం గొప్ప విషయమే. దీనితో అతడు సినిమా రీ-రిలీజ్ అయిన అన్ని సినిమాలలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది.

అతడు సినిమాతో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కాంబినేషన్లో  భవిష్యత్తులో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వ్యక్తిగతంగా మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య మంచి అనుబంధం ఉందనే  సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది

అతడు మూవీ విడుదలైన సమయంలో హిట్ గా నిలిచినా కలెక్షన్ల విషయంలో మరీ అద్భుతాలు చేయలేదు. బుల్లితెరపై మాత్రం ఈ సినిమా ఊహించని స్థాయిలో రేటింగ్ లను సొంతం చేసుకుంది.  రాజమౌళి సినిమాతో మహేష్ బాబు పాన్ వరల్డ్ స్థాయిలో కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: