
ఇందులో ముఖ్యంగా కియారా బికినీలో కనిపించే ఫుల్ సన్నివేశాలు తగ్గించాలని సూచించిందట. టీజర్ లో అలాగే అవన్ జావన్ అనే పాటలో కీయారా అద్వాని లుక్స్ కి చాలా రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఈ పాటలో 9 సెకండ్ల సెన్సువల్ విజువల్స్ ను తీసివేయాలంటు CBFC సూచించింది. దీనివల్ల కియారా అద్వాని బికినీ సీన్స్ కొంతవరకు కోతకు గురవుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలోని కియారా అద్వాని పాత్ర కోసం చాలానే కష్టపడినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇలా కనిపించడం కోసం చాలానే వ్యాయామాలు, ప్రత్యేకమైన డైట్ పాటించి ఫిట్నెస్ ను మెయింటైన్ చేసిందట కియారా.
బిహైండ్ ది సీన్స్ వీడియోలో కియారా లుక్స్ కి సోషల్ మీడియాలో భారీగానే క్రేజ్ ఏర్పడింది. కానీ ఇలాంటి సమయంలోనే సెన్సార్ బోర్డు ఇలాంటి సన్నివేశాలను తొలగించడంతో అభిమానులు చాలా నిరాశపడుతున్నారు. కియారా అద్వానీ కూడా ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ప్రస్తుతం తన వైవాహిక బంధం ఎంజాయ్ చేస్తోంది. సిద్ధార్థ్ నటిస్తున్న పరం సుందరి అనే రొమాంటిక్ చిత్రం కూడా ఆగస్టు 29నే రిలీజ్ కాబోతున్నది. ఇందులో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది. దీన్నిబట్టి చూస్తూ ఉంటే ఒకే నెలలోనే ఇలా కియారా, సిద్ధార్థ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే రజనీకాంత్ నటించిన కూలి సినిమా కూడా ఈ రెండు చిత్రాల మధ్య గట్టి పోటీ ఇవ్వబోతోంది.