ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు అంటే చాలామందికి సుపరిచితమే. ఈయన బతికున్న సమయంలో సినిమా ఇండస్ట్రీలోనే పనిచేశారు. అలా సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ అలాగే ప్రొడ్యూసర్ గా కూడా చేశారు.అయితే అలాంటి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు తన కొడుకు ప్రభాస్ ని ఇండస్ట్రీలోకి హీరోగా తీసుకువద్దామని కృష్ణంరాజుతో చెప్పి ఇండస్ట్రీలోకి హీరోగా తీసుకువచ్చారు.అలా ప్రభాస్ మొదటి మూవీ ఈశ్వర్.. ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్ర ఈ రెండు సినిమాలు కూడా హిట్ కాకపోయినాప్పటికీ వర్షం సినిమా ప్రభాస్ కి మంచి ఇమేజ్ ని తెచ్చి పెట్టింది.

సినిమా తర్వాత ప్రభాస్ కి ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేదు. అన్ని మంచి సినిమాలే వచ్చాయి.. అలా చత్రపతి మూవీతో ప్రభాస్ స్థాయి ఎక్కడికో పెరిగిపోయింది. అయితే అలాంటి ప్రభాస్ ఈశ్వర్ సినిమా చేసే సమయంలో తన తండ్రి మాటలకు కన్నీళ్లు పెట్టుకున్నారట. అయితే ఇది ఓల్డ్ వీడియో అయినప్పటికీ ప్రభాస్ కన్నీళ్లు పెట్టుకోవడం అంటే అభిమానుల్లో అదో క్యూరియాసిటీ అని చెప్పుకోవచ్చు. ఐదు సంవత్సరాలకు సరిపడా సినిమాలను ఒకేసారి అనౌన్స్ చేసి తీస్తున్న ప్రభాస్ తన మొదటి సినిమా షూటింగ్ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారట.

అది కూడా తన తండ్రి మాటలకు.. అయితే ఈశ్వర్ సినిమా టైంలో ఓ డైలాగ్ చెప్పాల్సి ఉంది. కానీ ఆ డైలాగ్ ప్రభాస్ తప్పుగా చెప్పడంతో ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు ప్రభాస్ చేతులు పట్టుకొని ఎస్ అని అన్నారట. ఇక తండ్రి మాట్లాడిన ఒక్క మాటతో ప్రభాస్ కళ్లల్లో నుండి ఎమోషనల్ గా కన్నీళ్లు వచ్చేసాయట. ఆ ఒక్క విషయం లో నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి అంటూ ప్రభాస్ గతంలో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్, స్పిరిట్, ఫౌజీ,కల్కి పార్ట్ -2, సలార్ 2 వంటి వరుస సినిమాలను లైన్ లో పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: