
రీసెంట్ గానే పుష్ప2 సినిమాతో సుకుమార్ ఎలాంటి క్రేజీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడో అందరికీ తెలుసు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తో ఒక మూవీకి కమిట్ అయ్యాడు సుకుమార్ . బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న "పెద్ది" సినిమా షూట్ కంప్లీట్ అయిపోగానే ఈ సినిమాను సెట పైకి తీసుకొచ్చే దానికి రెడీ అవుతున్నాడు సుకుమార్ . ఇలాంటి మూమెంట్లోనే ఆయన నెక్స్ట్ ఏ హీరోతో వర్క్ చేయబోతున్నాడు అనేది వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సుకుమార్ తన నెక్స్ట్ సినిమాను మహేష్ బాబుతో కమిట్ అయ్యాడట .
ఆల్రెడీ స్టోరీ కూడా వివరించేశారట . ఇంచుమించు మహేష్ బాబు కూడా ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఓకే అన్నట్లు సమాచారం అందుతుంది . అన్ని పక్కగా కుదిరితే చరణ్ తో మూవీ అయిపోయిన వెంటనే ఈ మూవీ ని స్ర్ట్స్ పై కి తీసుకొచ్చేయొచ్చు . కానీ మహేష్ బాబు ని రాజమౌళి ఎప్పుడు వదులుతాడు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ . రాజమౌళి సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు మహేష్ బాబు . ఈ సినిమా షూట్ అయిపోతే ఆయన తన నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించొచ్చు . రాజమౌళి త్వరగా షూటింగ్ కంప్లీట్ చేస్తే ఆ తర్వాత మహేష్ బాబు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచించొచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..????