తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో హరీష్ శంకర్ ఒకరు. ఈయన రవితేజ హీరోగా రూపొందిన షాక్ అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈయన రవితేజ హీరోగా మిరపకాయ్ అనే మూవీ ని రూపొందించి మంచి విజయాన్ని అందుకొని దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన కెరియర్లో గబ్బర్ సింగ్ మూవీ సూపర్ సాలిడ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆఖరుగా ఈయన మిస్టర్ బచ్చన్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీ లీల ,   రాశి ఖన్నా హీరోయిన్లుగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఇకపోతే గత కొన్ని రోజులుగా హరీష్ శంకర్ తన తదుపరి మూవీ ని విజయ్ దేవరకొండ హీరో గా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో చేయబోతున్నట్లు , ఇప్పటికే విజయ్ కి హరీష్ శంకర్ ఓ కథను వినిపించగా , ఆ కథ బాగా నచ్చడంతో విజయ్ వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , ఆ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించనున్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో రానున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అయింది.

తాజాగా ఇందుకు సంబంధించి హరీష్ శంకర్ ఓపెన్ అయ్యాడు. తాజాగా హరీష్ శంకర్ ఈ వార్తపై స్పందిస్తూ ... నేను నా నెక్స్ట్ మూవీ కి సంబంధించి ఇంకా ఏమి కమిట్ కాలేదు. కమిట్ అయ్యాక అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను నేనే విడుదల చేస్తాను అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. దానితో విజయ్ దేవరకొండ , హరీష్ శంకర్ , నాగ వంశీ కాంబోలో మూవీ రాబోతుంది అనే వార్తలు అన్ని ఫేక్ అని క్లారిటీ వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: