టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో హీరోయిన్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా మూవీ త్వరలో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. అనుపమ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలు నోరు మెదపడానికి ఆలోచిస్తారని అన్నారు. ఏదైనా అడిగితే ఈమెకు ఆటిట్యూడ్ ఎక్కువ అని అంటారని చెప్పుకొచ్చారు.

ఉదయం 7 గంటలకు షూటింగ్ కు వెళ్తే 9.30 వరకు వెయిట్ చేయాలనీ ఎందుకు ఆలస్యమైందని అడిగితే యాటిట్యూడ్ ఎక్కువని ముద్ర వేస్తారని ఆమె పేర్కొన్నారు. కో యాక్టర్ ఆలస్యంగా వచ్చిన సమయంలో  మమ్మల్ని ముందుగా ఎందుకు పిలవాలని ఆమె ప్రశ్నించారు.  ముందుగానే సెట్ కు పిలిచి రెండున్నర గంటల పాటు  ఎందుకు వెయిట్ చేయించాలని ప్రశ్నించారు.

ఈ గ్యాప్ లో చాలా షాట్స్ తీయొచ్చు కదా అని అడిగితే  నా డబ్బులు కదా మీకేంటి ఇబ్బంది అని అడుగుతారని  అమ్మాయిలను ఏదైనా డైరెక్ట్ గా అడిగేస్తారని అబ్బాయిలను మరో విధంగా ట్రీట్ చేస్తారని ఆమె పేర్కొన్నారు.  ఐతే అందరూ  ఇలానే చేస్తారని తాను  చెప్పట్లేదని అనుపమ తెలిపారు.  ఈ నెల 22వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ప్రవీణ్ కాండ్రేగుల డైరెక్షన్ లో  ఈ సినిమా తెరకెక్కింది.

దర్శన్, సంగీత కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ కొత్తగా ఉంది. భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తే మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు.  అనుపమ పరమేశ్వరన్ పారితోషికం ఒకింత భారీ స్థాయిలోనే ఉందని తెలుస్తోంది. అనుపమకు అభిమానించే అభిమానుల సంఖ్య మాత్రం అంతకంతకూ  పెరుగుతుండటం గమనార్హం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: