కొన్ని సంవత్సరాల క్రితం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 143 అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో పూరి జగన్నాథ్ తమ్ముడు అయినటువంటి సాయి రామ్ శంకర్ హీరో గా నటించగా ... ఈయనకు జోడిగా ఈ సినిమాలో సమీక్ష సింగ్ నటించింది. పూరీ జగన్నాథ్ వరుస పెట్టి అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకుంటూ వస్తున్న సమయంలో 143 అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. దానితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

సినిమా మంచి విజయం సాధించకపోవడం వల్ల ఈ సినిమా ద్వారా సమీక్ష సింగ్ కూడా మంచి గుర్తింపు దక్కలేదు. ఈమె ఆ తర్వాత అనేక భాషల సినిమాల్లో నటించింది. కానీ ఈమె తెలుగులో మాత్రం 143 సినిమా తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈమె పెద్దగా సినిమాలు చేయడం లేదు. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేస్తూ తన అభిమానులతో ఈమె బాగానే టచ్ లో ఉంటుంది. 

అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 143 సినిమా విడుదల అయ్యి చాలా సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి కూడా ఈ బ్యూటీ సూపర్ గా అందాలను మెయింటైన్ చేస్తూ వస్తోంది. దానితో కొన్ని సందర్భాలలో ఈమెకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న  ఫోటోలు సూపర్ గా సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 143 సినిమా విడుదల అయ్యే చాలా సంవత్సరాలు అవుతున్న సమీక్ష సింగ్ అద్భుతమైన రీతిలో అందాలను మెయింటైన్ చేస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: