సుమారుగా రూ.350 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన కూలీచిత్రం ఈరోజున రిలీజ్ అయింది. రజనీకాంత్, లోకేష్ కనకరాజు కాంబినేషన్లో ఫస్ట్ టైమ్ వచ్చిన ఈ సినిమా కావడంతో భారీ అంచనాలు పెరిగిపోయాయి.. అలాగే ఇందులో భారీ తారాగణం నటించడం ఈ సినిమాకి మరింత కలిసి వచ్చిందని చెప్పవచ్చు.. సినిమా విడుదలకు ముందే అంచనాలు సైతం ఆకాశాన్ని తాగడంతో పాటుగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ సినిమాని తెరకెక్కించడం అభిమానులను మరింత ఎక్సైటింగ్ కి గురిచేసింది. మరి అభిమానుల అంచనాలను కూలీ సినిమా అందుకుందా?లేదా ఇప్పుడు ఒకసారి చూద్దాం.



 కూలి సినిమా చూసిన నెటిజన్స్ సైతం ఈ సినిమా నిరాశపరిచిందని తెలుపుతున్నారు. ముఖ్యంగా సినిమా విడుదలకు ముందే అంచనాలను పెంచేశారని ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేదని తెలియజేస్తున్నారు. మొదటి సగభాగం  బాగానే ఉన్నప్పటికీ.. రెండవ సగభాగం మాత్రం సినిమా చూసే వారికి పరీక్షగా అనిపిస్తోందని తెలియజేస్తున్నారు. ఇక కూలీ సినిమాలోని కొన్ని సన్నివేశాల సమయంలో పాత సినిమా పాటలను ఉపయోగించడం తప్ప లోకేష్ కనకరాజు సృజనాత్మకతను చూపించలేకపోయారని కామెంట్స్ చేస్తున్నారు.


ఇక రజనీకాంత్ అభిమానులకు కొన్ని సన్నివేశాలు  బాగానే ఆకట్టుకున్నట్లు కనిపిస్తున్నాయి.. కానీ సినిమా పైన పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ కి అవి సరిపోవు. నాగార్జున నటన ఇందులో అద్భుతంగా ఆకట్టుకున్న. స్క్రీన్ ప్లే కూడా క్వాలిటీగా కనిపించలేదట.. తారాగణం మీద చేసిన ఖర్చు నిర్మాణంలో చేసి ఉంటే మరింత గొప్పగా ఉండేదని కామెంట్స్ చేస్తున్నారు. సినిమా మొత్తం కూడా వైజాగ్ మరియు అక్కడ పోర్టులో చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. భారీ హైప్ తీసుకువచ్చిన మౌనిక పాట కూడా బాగానే ఆకట్టుకుంది.


రజనీకాంత్ చివరి 20 నిమిషాలు తప్ప పెద్దగా ఎక్కడ కనిపించలేదు.. రజనీకాంత్ కంటే ఎక్కువగా సౌబిన్ స్క్రీన్స్ పై కనిపించారని అభిమానులు వాపోతున్నారు.. మొత్తం మీద భారీ అంచనాలు పెట్టుకొని సినిమాకి వెళ్తే మాత్రం నిరాశని మిగిల్చేలా కనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: