
కానీ నిజానికి సమంత రెండో పెళ్లి చేసుకోలేదు. ఆమె ‘రాజ్ నిడమూరు’తో రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నప్పటికీ.. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అంతేకాక, ఇప్పటివరకు సమంత - రాజ్ నిడుమూరుతో పెళ్లి విషయంపై స్పందించలేదు. ఇటీవల రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ట్రెడిషనల్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. జడ వేసుకుని, తలలో మల్లెపూలు పెట్టుకుని, నుదుట కుంకుమ పెట్టుకుని, ఒంటి నిండా నగలతో సమంత చాలా ముచ్చటగా కనిపించింది. సమంతను ఈ విధంగా చూసి చాలా కాలమైందని అభిమానులు చెబుతున్నారు.
దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కొంతమంది మొదట వీటిని ఆమె పెళ్లి ఫోటోలుగా అనుకున్నారు. కానీ అవి పెళ్లి ఫోటోలు కావు. అయితే సమంత మాత్రం నిజంగానే నిండు ముత్తైదువులా కనిపిస్తోందని అభిమానులు పొగడ్తలు కురిపిస్తున్నారు. కాగా సమంత తెలుగు సినిమాలకి సైన్ చేయడం లేదు. రీజన్ ఏంటో తెలియదు కానీ మంచి మంచి ఆఫర్స్ వస్తున్నా రిజెక్ట్ చేసి పడేస్తుంది. బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ అదే విధంగా ఓ సినిమాకి కమిట్ అయిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..!!
