
ఇప్పుడు అదే రీతిలో మరో సెన్సేషన్ ఏర్పడబోతోంది. ‘జైలర్ 2’ సినిమాలో నటసింహం బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో అలరించబోతున్నారని సమాచారం. మొదటి భాగం జైలర్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ కావడంతో, దర్శకుడు నెల్సన్ రెండో భాగాన్ని మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. జైలర్‌లో ఎలా అయితే అనూహ్యమైన స్టార్ క్యామియోలు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశాయో, జైలర్ 2లో కూడా అదే రీతిలో పెద్ద పెద్ద సర్‌ప్రైజ్‌లు ఉండనున్నాయి. అందులో ముఖ్యమైనది బాలయ్య ఎంట్రీ.
తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య మాస్ మేనియాకు ప్రత్యేక క్రేజ్ ఉంది. దీనిని బాగా అర్థం చేసుకున్న నెల్సన్, జైలర్ 2లో బాలయ్య క్యామియోను ఆ మాస్ ఎలిమెంట్స్‌కి తగ్గట్టుగానే డిజైన్ చేస్తున్నారని టాక్. ముఖ్యంగా ఆయన ఎంట్రీ సీన్‌తోనే థియేటర్లు కుదేలవుతాయనే అంచనాలు ఉన్నాయి. రజనీ – బాలయ్య కాంబినేషన్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ప్రేక్షకులకు అది ఒక పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. బాలయ్య ప్రస్తుతం ‘అఖండ 2 – తాండవం’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేనితో ఒక పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్, అలాగే క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘ఆదిత్య 999’ వరుసగా సెట్స్ మీదకు రానున్నాయి.