ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిన్న చిత్రాలలో కోర్టు సినిమా ముందు వరుసలో ఉంటుంది. ఈ చిత్రాన్ని హీరో నాని పరిమిత బడ్జెట్లో నిర్మించి భారీ విజయాన్ని అందుకున్నారు. ఇందులో హీరో హీరోయిన్స్ గా రోషన్, శ్రీదేవి నటించారు. అలాగే కీలకమైన పాత్రలో ప్రియదర్శి, శివాజీ వంటి వారు నటించారు. ఈ చిత్రాన్ని విశాఖపట్నం అబ్బాయి రామ్ జగదీష్ డైరెక్టర్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా సక్సెస్ తో ఏకంగా చిరంజీవి వంటి హీరోలతోనే ప్రశంసలు కూడా అందుకున్నారు.


తాజాగా డైరెక్టర్ రామ్ జగదీష్ సైలెంట్ గా వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కార్తీక అనే అమ్మాయితో కలిసి ఏడు అడుగులు వేశారు. ఆదివారం ఆగస్టు 17 రాత్రి విశాఖపట్నంలో వీరి వివాహం చాలా గ్రాండ్గా జరిగినట్లుగా తెలుస్తోంది. రామ్ జగదీష్ పెళ్లి వేడుకకు కోర్టు సినిమాకు సంబంధించి యాక్టర్స్  కూడా ఈ పెళ్లిలో అట్రాక్షన్ గా నిలిచారు. అందుకు సంబంధించి హీరో శివాజీ కూడా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో మొదట అభిమానులు ఆశ్చర్యపోయిన ఆ తర్వాత ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.


డైరెక్టర్ రామ్ జగదీష్ ది పెద్దలు కుదిరిచిన వివాహం అన్నట్లుగా వినిపిస్తోంది. రామ్ జగదీష్ భార్య పేరు కార్తిక ఆమె ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి కాదని సమాచారం. డైరెక్టర్ రామ్ జగదీష్ తదుపరి చిత్రం కూడా హీరో నాని నిర్మాణంలోనే తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది .ఇందులో హీరోగా మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలుపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి తన తదుపరి చిత్రాన్ని ఏ విధంగా తెరకెక్కిస్తారో అంటూ అభిమానులు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: