సినిమా ఇండస్ట్రీ లో వయసు ఏర్పడకుండా ఉండడం కోసం , అలాగే ఎప్పుడు స్లిమ్ గా కనబడడం కోసం కొంత మంది జిమ్ లో చాలా కష్టపడుతూ ఉంటారు. వయస్సు ఎక్కువ అయిన కూడా దానిని పట్టించుకోకుండా జూమ్లో అనేక గంటలు కష్టపడుతూ చెమటలు కక్కిస్తూ స్లిమ్ గా ఉంటారు. ఇకపోతే ఓ నటి కూడా 59 ఏళ్ల వయసులో జిమ్లో భారీ ఎత్తున కష్ట పడుతూ కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతూ వస్తుంది. అలాగే ఆమె వయస్సు 59 సంవత్సరాలు అయినా చూడడానికి మాత్రం అలా అస్సలు కనిపించదు. ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటించింది.

ఎన్నో విజయాలను అందుకుంది. అలాగే ఎన్నో సందర్భాలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇంతకు ఆ నటి ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ టాలెంటెడ్ నటి నదియా. ఈమె రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన మిర్చి సినిమాలో ప్రభాస్ కి తల్లి పాత్రలో నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం ,  ఇందులో ఈమె తన పాత్రతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఆ తర్వాత ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కు అత్త పాత్రలో నటించింది. 

మూవీ మంచి విజయం సాధించడం , ఈ సినిమాలో ఈమెకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో ఈ మూవీ ద్వారా ఈమె క్రేజ్ తెలుగులో మరింత పెరిగింది. ఆ తర్వాత ఈమె ఎన్నో తెలుగు సినిమాలలో నటించి నటిగా ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె వయస్సు 59 సంవత్సరాలు. కానీ ఈమె ఇప్పటికీ కూడా జిమ్ లో చాలా కష్టపడుతూ చమటలు కట్టిస్తుంది. తాజాగా అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: