ఏంటి తమన్నా 32 వేల కోట్ల కుంభకోణంలో ఇరుక్కుందా.. ఇది నిజమేనా..అని చాలా మంది ఆమె అభిమానులు సైతం షాక్ అయిపోతూ ఉంటారు.అయితే సెలబ్రిటీలు స్కామ్ లలో ఇరుక్కోవడం అనేది మామూలు విషయమే.ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు ఇలాంటి కుంభకోణాల్లో ఇరుక్కున్నారు. అలా తాజాగా తమన్నా పేరు వైరల్ అవుతుంది. ఇక తమన్నా 32 వేల కోట్ల కుంభకోణం సంగతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2003లో వైరల్ అయిన తెల్గి కుంభకోణం ఇప్పటి జనరేషన్ వాళ్లకు తెలుసో లేదో తెలియదు. కానీ 2003లో ఈ తెల్గి కుంభకోణం మాత్రం దేశవ్యాప్తంగా చాలా వైరల్ అయింది. అబ్దుల్ కరీం తెల్గి అనే వ్యక్తి 32 వేల కోట్ల కుంభకోణంలో ఇరుక్కున్నారు. అయితే ఈ వ్యక్తికి తమన్నా కి సంబంధాలు ఉన్నాయని అప్పట్లో ఒక వార్త కూడా వచ్చింది. అంతేకాదు తెల్గి అనే వ్యక్తి దేశవ్యాప్తంగా ఫేమస్ అవ్వడానికి మరో కారణం ఏంటంటే.. అంధేరీలో ఉండే ఓ లేడి బార్ లో డ్యాన్స్ చేసే డ్యాన్సర్ కి ఒక్క రాత్రికి 93 లక్షలు ఖర్చు చేశారట తెల్గి.

అయితే ఒక్క రాత్రికి 93 లక్షలు ఇచ్చి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు తెల్గి. అలా ఈయనకి సంబంధించిన వార్తలు వైరల్ అయ్యాయి. ఇక 93 లక్షల ఒక రాత్రికి తీసుకునే బార్ డాన్సర్ ఎవరో కాదు తరున్నుమ్ ఖాన్.. మరి వీరిద్దరి మధ్యలోకి తమన్నా ఎలా వచ్చింది అని మీ అందరికీ డౌట్ రావచ్చు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. అప్పట్లో ఒక రాత్రికి 93 లక్షలు తీసుకున్న బార్ డాన్సర్ గా తరున్నుమ్ ఖాన్ కి చాలా పాపులారిటీ వచ్చింది.దాంతో ఈ తరున్నుమ్ ఎవరో అని ఎంతో మంది తెలుసుకోవాలని చూశారు. అలా ఈమెయిల్ ద్వారా ఆమె ఫోటోలు పంపుకున్న సమయంలో తమన్నాకి సంబంధించిన ఒక ఫోటో వైరల్ అయింది. దీంతో తరున్నుమ్ ఖాన్ అంటే ఎవరో కాదు తమ్మన్నానే అని చాలామంది ఈ వార్తని వైరల్ చేశారు.దాంతో ఒక్కసారిగా తమన్నాకి ఈ విషయం తెలిసి షాక్ అయిపోయింది. ఇక అంత పెద్ద స్కామ్ లో ఇరుక్కున్న వ్యక్తికి సంబంధించిన ఇష్యూలో నా పేరు నా ఫోటో బయటకు వచ్చింది ఏంటి అని భయపడిపోయిన తమన్నా వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది.

అలాగే తరున్నుమ్ ఖాన్ తమన్నా అంటే ఒకరు కాదు. తరున్నుమ్ ఖాన్ వేరే.తమన్నా వేరే.. ఆ వివాదాస్పదమైన బార్  డాన్సర్ తో నా పేరుని ముడి పెట్టకండి. ఇలాంటి రూమర్లు ప్రచారం చేసి వేరే వాళ్ళ లైఫ్ తో ఆడుకోకండి. ఆ ఈమెయిల్లో వైరల్ అవుతున్న ఫోటో నేను సినిమా షూటింగ్లో జరిగిన ప్రెస్ మీట్ లో దిగినప్పటి ఫోటో. దాన్ని దీన్ని కలుపుతూ నాకు వేరే స్కామ్ లతో ముడి పెట్టకండి అంటూ మండిపడింది. అంతే కాదు అదే సమయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది.అయితే తరున్నుమ్ ఖాన్ తమన్నా ఇద్దరు ఒకటే అన్నట్లుగా వార్తలు రావడంతో తమన్నా పేరు చాలా వైరల్ అయింది. కానీ తమన్నా ఈ విషయంలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో ఇది కాస్త సర్థుమణిగింది.కానీ అప్పట్లో తెల్గి  కుంభకోణం సమయంలో తమన్నా పేరు వినిపించడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.అయితే మరొకసారి ఆ తెల్గి కుంభకోణం నెట్టింట్లో వైరల్ అవ్వడంతో తమన్నా పేరు కూడా ట్రెండింగ్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: