ఏంటి జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టబోతున్నారా..ఇది నిజమేనా.. ఇదే నిజమైతే టీడీపీకి ఇక చుక్కలే అంటున్నారు కొంతమంది టీడీపీ అంటే పడని వాళ్ళు.. అయితే జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నట్టు ఎక్కడా కూడా ప్రకటించలేదు. కానీ రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ వార్-2 మూవీ విడుదలయ్యాక అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ని తిట్టిన ఆడియో ఒకటి వైరల్ అయింది.అయితే ఈ ఆడియో వైరల్ అయినా కొద్దిసేపటికి దగ్గుబాటి  వెంకటేశ్వర ప్రసాద్ ఒక వీడియో విడుదల చేశారు. అది నేను మాట్లాడిన ఆడియో కాదు అని, ఎవరో కావాలనే నా మీద కక్ష్య కట్టి ఎన్టీఆర్ ని తిట్టినట్టు ఆడియో క్రియేట్ చేశారని, అందులో నా తప్పేమీ లేదు అని చెప్పారు. కానీ ఆయన నాలుగు గోడల మధ్య ఒక వీడియో విడుదల చేశారు.

కానీ బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటివరకు అందులో నా తప్పేమీ లేదు అని క్షమాపణలు చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ అభిమానులు అందరూ ఏపీలో ప్రెస్ మీట్ పెట్టాలి అనుకున్నారు.కానీ ఏపీ లో ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చివరికి హైదరాబాద్ వెళ్లి అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. ఇక ఆ ప్రెస్ మీట్ లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో భాగంగా ప్రజాస్వామ్యంలోనే మేము కూడా ఉన్నామని,అవసరమైతే ప్రజాక్షేత్రంలోకి కూడా వస్తామంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

 అయితే వీళ్లు మాట్లాడిన మాటల వెనుక అర్థం ఏమిటంటే.. మేం ప్రజాస్వామ్యంలోనే ఉన్నాము. అవసరమైతే రాజకీయాల్లోకి రావడానికి కూడా వెనకాడబోము అన్నట్లుగా సిగ్నల్స్ ఇచ్చారు. అయితే ఎన్టీఆర్ అభిమానులు ఈ మాటలు ఎన్టీఆర్ అంగీకారంతోనే అన్నారా.. లేక ఫ్రస్టేషన్లో అలా అన్నారో తెలియదు.కానీ ప్రస్తుతం ఈ మాటలు మాత్రం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఒకవేళ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిజంగానే పార్టీ పెడితే టిడిపిలో ఉన్న చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ పార్టీలోకి వస్తారు. ఒకరకంగా టిడిపికి గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చు అంటున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు. మరి ఇప్పటికైనా తగ్గి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ బయటికి వచ్చి ఎన్టీఆర్ క్షమాపణలు చెబుతారా..లేక ఈ గొడవ ఇలాగే కొనసాగేలా చేస్తారా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: