అనిల్ రావిపూడి ఇప్పటివరకు పాన్-ఇండియా లెవెల్లో చాలా పెద్ద పాపులారిటీ సంపాదించకపోయినా, ఆయన సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆయన తీసే సినిమాలు ప్రతి కామన్, మిడిల్ క్లాస్ జనాలకి బాగా టచ్ అవుతాయి. ప్రతి డైలాగ్ కూడా వాళ్లను దృష్టిలో పెట్టుకొని రాసుకున్నట్టుగానే అనిపిస్తుంది. ఆయన సినిమాలు రిలీజ్ అయ్యాక అభిమానులు డైలాగ్స్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు. ఆయన రాసే సీన్స్, డైలాగ్స్ హైలెట్ అవుతూ నటీనటులకి బాగా క్రేజ్ తెచ్చిపెడతాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఆయన సంపాదించుకున్న పాపులారిటీ అందరికీ తెలిసిందే. అలాంటి ఒక బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత అనిల్ ఎవరితో సినిమా చేయబోతున్నారు అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది. ఫైనల్లీ, ఆయన ఎప్పటినుంచో కలలు కంటున్న మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. ఈ సినిమా 40% షూటింగ్ దాదాపు పూర్తయిపోయిందని సమాచారం.


నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, అనిల్ రావిపూడి ఈ సినిమాకి సంబంధించిన ఒక గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో హైలెట్‌గా మారింది. చిరంజీవిని మెగా అభిమానులు ఎలా చూడాలని అనుకుంటున్నారో, అలా పర్ఫెక్ట్ బాస్ ఈజ్ బ్యాక్ లుక్‌లో చూపించారు. చిరంజీవి ఈ సినిమాలో పూర్తి ఎంటర్టైన్మెంట్‌తో అభిమానులను ఆకట్టుకోబోతున్నారని టీమ్ చెబుతోంది. గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత, అనిల్ రావిపూడి అభిమానులతో కొన్ని విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా వెంకటేష్ గారి క్యారెక్టర్ గురించి చెబుతూ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో వెంకటేష్ డైలాగ్స్ చెప్పిన విధానం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు చిరంజీవి సినిమాలోనూ విక్టరీ వెంకటేష్ అలాగే నాటీ క్యారెక్టర్ లో నటించబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.  అంతేకాదు, టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌కి వాయిస్ ఇవ్వమని అడిగితే వెంకటేష్ వెంటనే ఇచ్చారని కూడా అనిల్ రావిపూడు చెప్పారు.



ఇక, ఈ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశామని, త్వరలోనే ఆయన సెట్స్‌లో పాల్గొనబోతున్నారని చెప్పగానే, అభిమానులు అరుపులు, కేకలతో రంబోలా చేసేశారు. చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని ఒకే స్క్రీన్‌పై చూడబోతున్నారని తెలిసిన క్షణంలోనే ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చాయి. విక్టరీ వెంకటేష్ పాత్ర ఇంటర్వెల్ తర్వాత ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తోంది. అలాగే నయనతారవెంకటేష్చిరంజీవి సీన్స్ వేరే లెవెల్లో ఉండబోతాయని, ముఖ్యంగా కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చర్చలు ఊపందుకున్నాయి. గ్లింప్స్ హైప్ క్రియేట్ చేస్తూ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం నింపేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: