తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలలో పోకిరి మూవీ ఒకటి. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన గోవా బ్యూటీ ఇలియానామూవీ లో హీరోయిన్గా నటించింది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అప్పటివరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాలో విలన్ గ్యాంగ్ లో ఓ లేడీ విలన్ పాత్ర ఉంటుంది. ఆమె ఈ సినిమాలో ఎప్పుడు మహేష్ బాబు వెంటపడుతూ ఉంటుంది. కానీ మహేష్ బాబు మాత్రం ఆమెను దూరం పెడుతూ ఉంటాడు. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక సన్నివేశంలో ప్రకాష్ రాజ్ ఆమెను గిల్లితే ఆమె అరుస్తోంది. దానితో ప్రకాష్ రాజ్ గిల్లితే గిల్లించుకోవాలి ఆరవకూడదు అని అంటాడు. ఈ డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. ఈ సినిమాలో లేడీ విలన్ పాత్రలో నటించిన ముద్దుగుమ్మ పేరు షీవా రానా. పోకిరి సినిమా ద్వారా ఈ బ్యూటీ కి అద్భుతమైన గుర్తింపు వచ్చింది. 

ఆ తర్వాత ఈమె పెద్దగా తెలుగు సినిమాల్లో నటించలేదు. ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే రేంజ్ లో అందాలను మెయింటైన్ చేస్తూ కుర్ర కారును ఫీదా చేస్తూ వస్తుంది. పోకిరి సినిమా విడుదల అయ్యి చాలా కాలమే అవుతున్న ఇప్పటికీ ఈమె అదిరిపోయే రేంజ్ లో అందాలను మెయింటైన్ చేస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: